ఆ సమయంలో వ్యాయామం మంచిది కాదా?
అవాస్తవం
మహిళలకు రుతు సమయంలో రక్తం పోతుంది కాబట్టి ఆ టైమ్‌లో వ్యాయామం చేస్తే మరింత అలసట కలుగుతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది కేవలం అపోహ. రుతుస్రావం అన్నది ఒక సాధారణమైన, అత్యంత సహజమైన ప్రక్రియ. రోజువారీ కార్యక్రమాలకు అది అడ్డంకి కానట్లే వ్యాయామానికీ అడ్డంకి కాదు. దీనికి క్రీడాకారులే ఉదాహరణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణు లంతా దీన్ని సహజంగానే తీసుకుంటారు.
వాళ్లు ఆ సమయంలోనూ తమ శిక్షణ కార్య కలాపాలను మానుకోరు. ఆటల్లో పాల్గొని గెలుపొందుతారు కూడా. ఒలింపిక్స్‌లోనూ పాల్గొని మెడల్స్ గెలుచుకుంటూ ఉంటారు. కాబట్టి రుతు సమయంలో వ్యాయామం చేయకూడదన్నది అపోహ మాత్రమే. కాకపోతే ఆ టైమ్‌లో రక్తం కోల్పోవడం వల్ల ఐరన్ పాళ్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వుంచిది.
అంటే... వేటవూంసం, చికెన్, చేపలు, వూంసాహారంతో లివర్, శాకాహారులైతే తాజా ఆకుకూరలు, ఎండు ఖర్జూరం, గసగసాలు (జింజెల్లీ సీడ్స్), అటుకులు వంటి పదార్థాలు పీరియడ్స్ సమయంలోనే గాకుండా మామూలుగానూ తీసుకుంటుంటే కోల్పోయిన ఐరన్ మళ్లీ భర్తీ అవుతుంది. అయితే... ఆ సవుయుంలో ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మందకొడిగా మారి వ్యాయామం చురుగ్గా చేయలేకపోవచ్చు. కేవలం రుతు సమయంలోనే గాక... మిగతా టైమ్‌లో కూడా అలాంటి ఆహారం వల్ల చురుగ్గా ఉండలేకపోవచ్చు. కాబట్టి ఉప్పు, కొవ్వులు తగ్గించాలి. ఆ సవుయుంలో నీళ్లు, పళ్లరసాల వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగాలి. వేళకు కంటినిండా నిద్రపోవాలి.