Smriti Irani And Mumbai Police Shares Meme On Funny Viral Video Of Musicians Performing Enthusiastically - Sakshi
Sakshi News home page

స్మృతి ఇరానీ పోస్ట్‌.. నవ్వకుండా ఉండలేం!

Published Sat, Mar 13 2021 7:50 PM | Last Updated on Sun, Mar 14 2021 1:39 AM

Smriti Irani Shares Funny Video On Instagram Its Viral On Social Media - Sakshi

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే ఫన్నీ మీమ్స్‌, ఫోటోలు, వీడియోలను తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తూ ఉంటారు. ఆమె తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘మీ చార్టర్డ్‌ అకౌంటెంట్ స్నేహితులు మార్చి నెల ముగిసే సమయంలో ఇలాగే ఉత్సాహంగా ప్రవర్తిస్తారు’ అంటూ సరదాగా కామెంట్‌ జతచేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఇందులో నలుగురు సంగీత వాయద్యకారులు తమను తాము మరిచి ఉత్సహభరితంగా పాట పాడుతూ తబలా, హార్మోనియం వాయిస్తారు. ఆ సంగీత వాయిద్యకారులు ఇచ్చే ముఖకవలికలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మరింత ఫన్నిగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చేసిన తర్వాత నవ్వకుండా ఉండలేమంటున్నారు. అదే విధంగా ఈ వీడియోను ముంబై పోలీసులు కూడా తమ ఆధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘హ్యాకర్లు చాలా సులభమైన పాస్‌వర్డ్‌‌ ద్వారా అకౌంట్లను ఓపెన్‌ చేస్తే.. ఈ వీడియోలో ఉన్నవారిలాగానే ఉత్సహంగా ఉంటారు’ అని కామెంట్‌ జత చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement