సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌ను ఎప్పటికప్పుడు ఎంటర్‌టైన్ చేస్తారన్న విషయం తెలిసిందే. తను చేసే పనికి సంబంధించి, కుటుంబ సభ్యులతో కలిసి దిగే ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజాగా స్మృతి కొన్ని మీమ్స్‌ని పోస్ట్ చేశారు. వాటిలో మొదటిది నేను ఐదు సంవత్సరాల క్రితం నాటి పాత దానిని ధరించాను. అది నాకు సరిగ్గా సరిపోయింది. ఆ విషయంలో చాలా గర్వపడుతున్నాను. ఇంతకీ అదేంటంటే నా స్కార్ఫ్. ప్రతి విషయంలో పాజిటివిటీని చూడాలి అని స్మృతి పోస్ట్ చేశారు.
(స్మృతి ఇరానీ పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా..)
ఇక రెండవ దానిలో ‘నువ్వు అలా అనకూడదు అనే దశ నుంచి అని చూడు ఏమౌంతుందో చూద్దాం’ అని నా మెదడు చెప్పే వయసుకు నేను చేరుకున్నాను అని పోస్ట్ చేశారు. ఇక మూడో పోస్ట్‌లో అర్థం పర్థంలేని వారు ఎలా మాట్లాడతారో అలా ‘మీరు ఎప్పుడైనా ఎవరి మాటలైనా విని ఆశ్చర్యపోయారా, మీకు షూలేస్ ఎవరు కడతారు?’ అని అడిగారు. వీటిని చూసిన వెంటనే పెదవులపై కచ్చితంగా నవ్వు వస్తుంది కదా. ఇలాంటి ఫన్నీ మీమ్స్‌ని పోస్ట్ చేసి స్మృతి ఈ రోజు తన ఫాలోవర్స్‌ను ఆనందపరిచారు. (‘ఒంటరిగా పోరాడితే.. బలవంతులవుతారు’)
Comments
Please login to add a commentAdd a comment