వైరల్‌ : నీ పాటికి పోతే! మా పరిస్థితి ఏంటి? | Dog Blow Car Horn For Owners Help Who Locked In Car | Sakshi
Sakshi News home page

వైరల్‌ : నీ పాటికి పోతే! మా పరిస్థితి ఏంటి?

Published Mon, Jan 13 2020 5:48 PM | Last Updated on Mon, Jan 13 2020 7:17 PM

Dog Blow Car Horn For Owners Help Who Locked In Car - Sakshi

కారులో షర్‌ పీ

మెల్‌బోర్న్‌ :  ఫొటోను చూడగానే మనకేమనిపిస్తుంది! కుక్క కారు నడపటానికి ట్రై చేస్తోందేమో అనిపిస్తుంది కదూ. కానీ, ఆ కుక్క సహాయం కోసం అర్థిస్తోంది. అవును! కారులో తనను, తన ఫ్రెండ్‌ను లాక్‌ చేసి ఎక్కడికో వెళ్లిపోయిన యాజమానికి వినపడేలా సహాయం కోసం మోత మోగించింది. వివరాల్లోకి వెళితే.. సౌత్‌ మెల్‌బోర్న్‌కు చెందిన షర్‌ పీ అనే కుక్క తన యాజమానితో కలిసి కారులో ఓ చోటుకి వచ్చింది. అయితే యాజమాని మాత్రం దాన్ని కారులో ఉంచి లాక్‌ వేసుకుని వెళ్లిపోయాడు. యాజమాని తొందరగా రాకపోవటంతో విసుగు చెందిన షర్‌ పీకి కోపం వచ్చింది. వెంటనే స్టీరింగ్‌ మీదకు దూకి హారన్‌ కొట్టడం ప్రారంభించింది. తన కారు హారన్‌ విన్న యాజమాని వెంటనే అక్కడకు చేరుకున్నాడు.

‘ ఏంట్రా! ఇలా చేశావేంట్రా!.. ఐదు నిమిషాల లేటుకే హారన్‌ మోత మోగిస్తున్నావేంటి?’ అని ప్రశ్నిస్తూ డోరు తీశాడు. దీంతో షర్‌ అతడివైపు ‘నీ పాటికి పోతే! మా పరిస్థితి ఏంటి?’ అన్నట్లు చూసి కిందకు దిగింది! దాంతో పాటు దాని మిత్రుడు కూడా కిందకు దిగాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ సైక్లిస్టు ఈ దృశ్యాలను తన సెల్‌ ఫోన్‌లో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచాడు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

కారు దగ్గరకు వస్తున్న యాజమాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement