ఈ ఫొటోను చూడగానే మనకేమనిపిస్తుంది! కుక్క కారు నడపటానికి ట్రై చేస్తోందేమో అనిపిస్తుంది కదూ. కానీ, ఆ కుక్క సహాయం కోసం అర్థిస్తోంది. అవును! కారులో తనను, తన ఫ్రెండ్‌ను లాక్ చేసి ఎక్కడికో వెళ్లిపోయిన యాజమానికి వినపడేలా సహాయం కోసం మోత మోగించింది. వివరాల్లోకి వెళితే.. సౌత్ మెల్‌బోర్న్‌కు చెందిన షర్ పీ అనే కుక్క తన యాజమానితో కలిసి కారులో ఓ చోటుకి వచ్చింది. అయితే యాజమాని మాత్రం దాన్ని కారులో ఉంచి లాక్ వేసుకుని వెళ్లిపోయాడు. యాజమాని తొందరగా రాకపోవటంతో విసుగు చెందిన షర్ పీకి కోపం వచ్చింది. వెంటనే స్టీరింగ్ మీదకు దూకి హారన్ కొట్టడం ప్రారంభించింది. తన కారు హారన్ విన్న యాజమాని వెంటనే అక్కడకు చేరుకున్నాడు.