
మెల్‌బోర్న్ : ఆ రెండు జీవులు ప్రాణాంతకమైనవే. గొడవ ఎలా మొదలైందో తెలియదు కానీ, రెండిటిని చావు అంచుల దగ్గరకు తీసుకెళ్లింది. ఈ భీకరపోరులో ప్రపంచంలోనే రెండవ ప్రాణాంతకమైన దానికి చావు తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. అడిలైడ్‌కు చెందిన ఓ మహిళ గత శుక్రవారం బట్టలు ఆరేయటానికి ఇంటి బ్యాక్‌యార్డ్‌కు వెళ్లింది. అక్కడ ఆస్ట్రేలియాలోనే అతి ప్రమాదకరమైన జీవులు రెడ్ బ్యాక్ సాలీడు, బ్రౌన్ స్నేక్ గొడవపడుతూ కనిపించాయి. సాలెగూడులో చిక్కుకున్న పాము అందులోనుంచి తప్పించుకోవటానికి ఎంత గానో ప్రయత్నించింది కానీ, కుదరలేదు. సాలీడు దాన్ని పక్కకు తప్పించుకోకుండా తన జిగురు తీగలను మెడకు చుడుతూ కొరకటం ప్రారంభించింది. పెద్దమొత్తంలో జిగురు తీగలను పాము తలకు చుట్టడంతో అది నోరు తెరవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సాలీడు.. పాము మెడను తీవ్రంగా కొరికింది. పెద్ద మొత్తంలో విషం పాము తలలోకి ఎక్కటంతో అది చనిపోయింది.
చనిపోయిన పాము... రెడ్ బ్యాక్ సాలీడు
రెడ్ బ్యాక్ సాలీడుకు తన జిగురు తీగలు, విషమే బలం. పెద్దపెద్ద పాముల్ని కూడా ఈజీగా చంపేయగలదు. అందుకే ఆస్ట్రేలియాలోని అతి ప్రమాదకరమైన జీవుల్లో ఇది కూడా ఒకటి. ఇక బ్రౌన్ స్నేక్ విషయానికి వస్తే ప్రపంచంలోనే రెండవ అతి ప్రమాదకర పాము. ఆ దేశంలో ఏటా సంభవిస్తున్న పాము కాటు మరణాలల్లో 50 శాతం బ్రౌన్ స్నేక్ వల్లే అవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment