#TeamIndia మోత మోగింది! | IND vs AUS: Team India Trending in Social Media | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌లో టీమిండియా

Published Tue, Jan 19 2021 1:38 PM | Last Updated on Tue, Jan 19 2021 7:41 PM

IND vs AUS: Team India Trending in Social Media - Sakshi

న్యూఢిల్లీ: బ్రిస్బేన్‌లో టీమిండియా సత్తా చాటింది. నిర్ణయాత్మక గబ్బా టెస్ట్‌ మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయాన్ని సాధించి భారత్‌ జాతీయ పతకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. కుర్రాళ్ల పోరాట పటిమతో బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీని వరుసగా రెండోసారి దక్కించుకుని ఆస్ట్రేలియాపై తమదే పైచేయి అని నిరూపించింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియాపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో టీమిండియా హాష్‌టాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. మ్యాచ్‌ ముగిసిన పది నిమిషాల్లోపు లక్షల్లో ట్వీట్లు, రీ ట్వీట్లతో ట్విటర్‌లో మోత మోగింది. (చదవండి: చెలరేగిన పంత్‌.. భారత్‌ సంచలన విజయం)

టీమిండియా పేరుతో అభినందనలు, శుభాకాంక్షలు, ప్రశంసలు, ఫొటోలు, వీడియోలు.. సోషల్‌ మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతున్నాయి. ఇక రెండో ఇన్నింగ్స్‌లో రాణించిన యువ ఆటగాళ్లు శుభమన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌లపై మాజీ ఆటగాళ్లు, క్రికెట్‌ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మ్యాచ్‌ విజయంలో వీరిద్దరూ ముఖ్యపాత్ర పోషించారని తెగ మెచ్చుకుంటున్నారు. మ్యాచ్‌ గెలిచిన తర్వాత త్రివర్ణ పతాకంతో టీమిండియా ఆటగాళ్లు మైదానం అంతా కలియ తిరగడం భారత క్రికెట్‌ అభిమానులను ఎంతోనే ఆటగానో ఆకట్టుకుంది. ‘ప్రౌడ్‌ మూమెంట్‌’ అంటూ అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతున్న హాష్‌ట్యాగ్స్‌
#INDvsAUS
#TeamIndia
#RishabhPant

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement