భారత్‌పై మేం ఓడిపోతాం | Champions Trophy 2017: Afridi Heaps Praise On Kohli, Terms India Favorites To Beat Pakistan | Sakshi
Sakshi News home page

భారత్‌పై మేం ఓడిపోతాం

Published Sat, Jun 3 2017 9:45 AM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM

భారత్‌పై మేం ఓడిపోతాం - Sakshi

భారత్‌పై మేం ఓడిపోతాం

చాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా ఇండియాతో జరగనున్న మ్యాచ్‌లో తమ జట్టు ఓడిపోతుందని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్‌పై భారత్‌ పైచేయి సాధిస్తుందని అనడానికి రెండు కారణాలను చెప్పుకొచ్చాడు. అందులో ఒకటి భారత్‌ రికార్డు బాగుండటమని మరొటి భారత్‌ ఆటగాళ్లు మంచి సమతూకంతో ఉండటమని తెలిపాడు.

అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్న బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు ఆఫ్రిది. కోహ్లీ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదని వన్డేల్లో అతని రికార్డుల గురించి అందరికీ తెలుసునని అన్నాడు. కోహ్లిని త్వరగా ఔట్‌ చేయడంపైనే పాకిస్తాన్‌ బౌలర్లు దృష్టి సారించాలని సూచించాడు. క్రీజులో కోహ్లి పాతుకుపోక ముందే అతన్ని ఔట్‌ చేయాలని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement