కోహ్లి అద్భుతమైన కెప్టెన్‌: రవిశాస్త్రి | Ravi shastri admires kohli as captain | Sakshi
Sakshi News home page

కోహ్లి అద్భుతమైన కెప్టెన్‌: రవిశాస్త్రి

Published Wed, Jul 12 2017 4:18 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

కోహ్లి అద్భుతమైన కెప్టెన్‌: రవిశాస్త్రి

కోహ్లి అద్భుతమైన కెప్టెన్‌: రవిశాస్త్రి

న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు విరాట్‌ కోహ్లి అద్భుతమైన కెప్టెన్‌ అని కోచ్‌ రవిశాస్త్రి అన్నారు. కెప్టెన్‌గా మరో ఐదేళ్లు రాణించే సత్తా కోహ్లికి ఉందని చెప్పారు. భారత జట్టుకు మరిన్ని విజయాలను చేకూర్చుతానని అన్నారు. భారత క్రికెట్‌ ఇప్పటివరకూ చూడని టెస్టు క్రికెట్‌ టీమ్‌ కోహ్లి సారథ్యంలో సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. టీంలో ఉన్న ఆటగాళ్లందరూ అన్ని పరిస్ధితిల్లో ఆడగల సత్తా కలిగి ఉన్నారని అన్నారు.

గత 12 నెలలుగా టీమిండియాలో ఏం జరిగిందో తనకు తెలీదని చెప్పారు. కానీ, ఇక నుంచి కొత్త శకాన్ని ప్రారంభిస్తామని అన్నారు. టీంలో ఉన్న ఫాస్ట్‌ బౌలర్లు అన్ని రకాలు రాణిస్తుండటం శుభసూచకమని అన్నారు. ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్న శ్రీలంక పర్యటన నుంచి రవిశాస్త్రి చూపిన బాటలో భారత టీమ్‌ నడవనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement