అడిలైడ్‌లో తొలి టెస్టు! | Gabba Test postponed, first Test now could be in Adelaide | Sakshi
Sakshi News home page

అడిలైడ్‌లో తొలి టెస్టు!

Published Mon, Dec 1 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

అడిలైడ్‌లో తొలి టెస్టు!

అడిలైడ్‌లో తొలి టెస్టు!

సిడ్నీ: భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన తొలి టెస్టు బ్రిస్బేన్ నుంచి అడిలైడ్‌కు మారే అవకాశాలున్నాయి. క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతికి నివాళిగా అతడు స్థిరపడిన అడిలైడ్‌లో ఈ మ్యాచ్‌ను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’లో కథనం వెలువడింది. షెడ్యూల్ ప్రకారం అడిలైడ్‌లో డిసెంబర్ 12 నుంచి 16 వరకు రెండో టెస్టు జరగాల్సి ఉంది. అయితే ఈ నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇదే ప్రారంభ మ్యాచ్ కానుందని ఆ పత్రిక పేర్కొంది. ఆసీస్ ఆటగాళ్లు కూడా అప్పటిలోగా తమ సహచరుడి మృతి నుంచి కోలుకునే అవకాశాలుంటాయి. ఇక బ్రిస్బేన్ టెస్టును అడిలైడ్ టెస్టు, బాక్సింగ్ డే టెస్టు (డిసెంబర్ 26-30) మధ్యన ఆడించనున్నారు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
 
హ్యూస్ అంత్యక్రియలకు కోహ్లి, రవిశాస్త్రి
అడిలైడ్:
బుధవారం జరిగే క్రికెటర్ ఫిల్ హ్యూస్ అంత్యక్రియలకు విరాట్ కోహ్లి, రవిశాస్త్రి, కోచ్ ఫ్లెచర్, టీమ్ మేనేజర్ అర్షద్ అయూబ్ హాజరుకానున్నారు.
 
అబాట్‌ను నిందించడం లేదు: క్లార్క్
మెల్‌బోర్న్: ఫిలిప్ హ్యూస్ మృతికి కారణమైన బౌన్సర్‌ను వేసిన పేసర్ సీన్ అబాట్‌ను ఎవరూ తప్పుపట్టడం లేదని ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. ఈ దురదృష్టకర సంఘటనలో అబాట్ తప్పేమీ లేదని, ఆసీస్ జట్టు మొత్తం అతడికి పూర్తి మద్దతునిస్తుందని చెప్పాడు. మరోవైపు హ్యూస్ ఆఖరి ఇన్నింగ్స్‌లో 63 రిటైర్డ్‌హర్ట్ అని కాకుండా 63 నాటౌట్‌గా స్కోర్ కార్డ్‌ను మారుస్తున్నట్లు సీఏ ప్రకటించింది. ఈ నిర్ణయం చిన్నదిగా అనిపించినా, హ్యూస్ ఎప్పటికీ నాటౌట్ అనే భావం కనిపిస్తుందని సీఏ చీఫ్ సదర్లాండ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement