phillip hughes death
-
దివంగత క్రికెటర్ హ్యూస్ గౌరవార్థం...
పెర్త్: ఆట ఆడే మైదానంలో ఆయువు కోల్పోయిన ఆ్రస్టేలియన్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్కు దశమ వర్ధంతి సందర్భంగా క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ఘనమైన నివాళులు అరి్పంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 6 నుంచి 10 వరకు అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టు ప్రారంభానికి ముందు సంస్మరణ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో భాగంగా పదేళ్ల క్రితం మృతి చెందిన తమ క్రికెటర్‌ను ఆ జట్టు తరఫున 13వ ప్లేయర్‌గా ఆ టెస్టు జాబితాలో చేర్చనుంది. అలాగే 63 సెకన్ల పాటు (చివరగా అతను చేసిన స్కోరు) ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో అడిలైడ్ ఓవల్ మైదానం మార్మోగనుంది. దీంతోపాటు తమ దేశవాళీ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో మూడు మ్యాచ్‌ల పాటు ఆటగాళ్లంతా నల్ల రిబ్బన్లతో (ఆర్మ్‌బ్యాండ్) బరిలోకి దిగుతారు. ఈ మూడు మ్యాచ్‌లు జరిగే వేదికల వద్ద ఆసీస్ జాతీయ పతాకాన్ని అవనతం చేయనున్నట్లు సీఏ తెలిపింది. 2014లో దేశవాళీ టోర్నీ ఆడుతున్న 25 ఏళ్ల హ్యూస్... పేసర్ సీన్ అబాట్ బౌన్సర్‌కు బలయ్యాడు. బుల్లెట్లా దూసుకొచి్చన బౌన్సర్ అంతే వేగంతో తల వెనుకవైపు బలంగా తాకింది. దీంతో ఉన్నపళంగా హ్యూస్ పిచ్‌పైనే నేలకొరిగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేసినా... ఫలితం లేకపోయింది. కోమాలోకి వెళ్లిన బ్యాటర్ తన పుట్టినరోజు (30)కు మూడు రోజుల ముందు నవంబర్ 27న తుదిశ్వాస విడిచాడు. ఈ దివంగత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆసీస్ తరఫున అంతర్జాతీయ కెరీర్లో 26 టెస్టులు, 25 వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. -
హ్యూస్ అంత్యక్రియలకు'లైవ్' ఏర్పాట్లు!
సిడ్నీ:గత నాలుగురోజుల క్రితం క్రికెట్ లో తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఆసీస్ క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ అంత్యక్రియలను లైవ్ లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 3 (బుధవారం)న హ్యూస్ అంత్యక్రియలు నార్తర్న్ న్యూసౌత్ వేల్స్‌లోని తమ సొంతూరు మాక్స్‌విలేలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిల్ చదువుకున్న పాఠశాలలోని స్పోర్ట్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు క్రికెటర్‌కు అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియల కార్యక్రమాన్ని లైవ్ లో ప్రసారం చేసేందుకు ఎస్జీజీ (సిడ్నీ క్రికెట్ గ్రౌండ్) లో స్రీన్ ను ఏర్పాటు చేసినట్లు సీఏ తెలిపింది. హ్యూస్ అంతిమ సంస్కార కార్యక్రమాన్ని ఛానల్ 9 లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని పేర్కొంది. ఇప్పటికే హ్యూస్ ఆఖరి ఇన్నింగ్స్‌లో 63 రిటైర్డ్‌హర్ట్ అని కాకుండా 63 నాటౌట్‌గా స్కోర్ కార్డ్‌ను మారుస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన విషయం తెలిసిందే. -
అడిలైడ్‌లో తొలి టెస్టు!
సిడ్నీ: భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన తొలి టెస్టు బ్రిస్బేన్ నుంచి అడిలైడ్‌కు మారే అవకాశాలున్నాయి. క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతికి నివాళిగా అతడు స్థిరపడిన అడిలైడ్‌లో ఈ మ్యాచ్‌ను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’లో కథనం వెలువడింది. షెడ్యూల్ ప్రకారం అడిలైడ్‌లో డిసెంబర్ 12 నుంచి 16 వరకు రెండో టెస్టు జరగాల్సి ఉంది. అయితే ఈ నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇదే ప్రారంభ మ్యాచ్ కానుందని ఆ పత్రిక పేర్కొంది. ఆసీస్ ఆటగాళ్లు కూడా అప్పటిలోగా తమ సహచరుడి మృతి నుంచి కోలుకునే అవకాశాలుంటాయి. ఇక బ్రిస్బేన్ టెస్టును అడిలైడ్ టెస్టు, బాక్సింగ్ డే టెస్టు (డిసెంబర్ 26-30) మధ్యన ఆడించనున్నారు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. హ్యూస్ అంత్యక్రియలకు కోహ్లి, రవిశాస్త్రి అడిలైడ్: బుధవారం జరిగే క్రికెటర్ ఫిల్ హ్యూస్ అంత్యక్రియలకు విరాట్ కోహ్లి, రవిశాస్త్రి, కోచ్ ఫ్లెచర్, టీమ్ మేనేజర్ అర్షద్ అయూబ్ హాజరుకానున్నారు. అబాట్‌ను నిందించడం లేదు: క్లార్క్ మెల్బోర్న్: ఫిలిప్ హ్యూస్ మృతికి కారణమైన బౌన్సర్‌ను వేసిన పేసర్ సీన్ అబాట్‌ను ఎవరూ తప్పుపట్టడం లేదని ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. ఈ దురదృష్టకర సంఘటనలో అబాట్ తప్పేమీ లేదని, ఆసీస్ జట్టు మొత్తం అతడికి పూర్తి మద్దతునిస్తుందని చెప్పాడు. మరోవైపు హ్యూస్ ఆఖరి ఇన్నింగ్స్‌లో 63 రిటైర్డ్‌హర్ట్ అని కాకుండా 63 నాటౌట్‌గా స్కోర్ కార్డ్‌ను మారుస్తున్నట్లు సీఏ ప్రకటించింది. ఈ నిర్ణయం చిన్నదిగా అనిపించినా, హ్యూస్ ఎప్పటికీ నాటౌట్ అనే భావం కనిపిస్తుందని సీఏ చీఫ్ సదర్లాండ్ అన్నారు.