అడిలైడ్ టెస్టులో సీఏ సంస్మరణ కార్యక్రమం
పెర్త్: ఆట ఆడే మైదానంలో ఆయువు కోల్పోయిన ఆ్రస్టేలియన్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్‌కు దశమ వర్ధంతి సందర్భంగా క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ఘనమైన నివాళులు అరి్పంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 6 నుంచి 10 వరకు అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టు ప్రారంభానికి ముందు సంస్మరణ కార్యక్రమం నిర్వహించనుంది.
ఇందులో భాగంగా పదేళ్ల క్రితం మృతి చెందిన తమ క్రికెటర్‌ను ఆ జట్టు తరఫున 13వ ప్లేయర్‌గా ఆ టెస్టు జాబితాలో చేర్చనుంది. అలాగే 63 సెకన్ల పాటు (చివరగా అతను చేసిన స్కోరు) ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో అడిలైడ్ ఓవల్ మైదానం మార్మోగనుంది. దీంతోపాటు తమ దేశవాళీ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో మూడు మ్యాచ్‌ల పాటు ఆటగాళ్లంతా నల్ల రిబ్బన్‌లతో (ఆర్మ్‌బ్యాండ్) బరిలోకి దిగుతారు.
ఈ మూడు మ్యాచ్‌లు జరిగే వేదికల వద్ద ఆసీస్ జాతీయ పతాకాన్ని అవనతం చేయనున్నట్లు సీఏ తెలిపింది. 2014లో దేశవాళీ టోర్నీ ఆడుతున్న 25 ఏళ్ల హ్యూస్... పేసర్ సీన్ అబాట్ బౌన్సర్‌కు బలయ్యాడు. బుల్లెట్‌లా దూసుకొచి్చన బౌన్సర్ అంతే వేగంతో తల వెనుకవైపు బలంగా తాకింది. దీంతో ఉన్నపళంగా హ్యూస్ పిచ్‌పైనే నేలకొరిగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేసినా... ఫలితం లేకపోయింది. కోమాలోకి వెళ్లిన బ్యాటర్ తన పుట్టినరోజు (30)కు మూడు రోజుల ముందు నవంబర్ 27న తుదిశ్వాస విడిచాడు. ఈ దివంగత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆసీస్ తరఫున అంతర్జాతీయ కెరీర్‌లో 26 టెస్టులు, 25 వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment