కోచ్ ఎంపికలో మరో ట్విస్ట్ | BCCI twist over india cricket coach | Sakshi
Sakshi News home page

కోచ్ ఎంపికలో మరో ట్విస్ట్

Published Tue, Jul 11 2017 6:12 PM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

కోచ్ ఎంపికలో మరో ట్విస్ట్

కోచ్ ఎంపికలో మరో ట్విస్ట్

న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ కోచ్‌ ఎంపికలో బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. కోచ్పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ ప్రకటించింది. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అందరూ ఊహించినట్లుగానే రవిశాస్త్రినే వరించిందంటూ మంగళవారం జోరుగా ప్రచారం జరిగింది.

గత కొన్నిరోజుల నుంచి కొనసాగుతున్న సందిగ్ధతకు ముగింపు పలుకుతూ మాజీ డైరెక్టర్ రవిశాస్త్రినే కోచ్ గా బీసీసీఐ నియమించిందంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఈ వార్తను బీసీసీఐ ఖండించింది. తామింకా తుది నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే కోచ్ ఎంపిక పై అధికారికంగా ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. మంగళవారమే కోచ్‌ ఎవరన్నదీ తెలుస్తుందని తానూ భావిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement