దుబాయ్: ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నంబర్‌వన్ స్థానంలోనే కొనసాగుతున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో అతను తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు. ఇతర భారత ఆటగాళ్లలో యువ సంచలనాలు పృథ్వీ షా 73 నుంచి 60వ ర్యాంక్‌కు... రిషభ్ పంత్ 85 నుంచి 62వ స్థానానికి ఎగబాకారు. బౌలర్ల జాబితాలో విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ కెరీర్‌లో తొలిసారి టాప్–10 (9వ)లోకి అడుగు పెట్ట గా, హైదరాబాద్ టెస్టులో పది వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్ 25వ స్థానంలో నిలిచాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment