అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ ఖర్చు చేసే విషయంలో కూడా ఆటగాళ్లకంటే అధికారులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది.
ముంబై: అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ ఖర్చు చేసే విషయంలో కూడా ఆటగాళ్లకంటే అధికారులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. విదేశాల్లో పర్యటించేటప్పుడు రోజూవారీ భత్యం క్రికెటర్లకంటే అధికారులకే ఎక్కువగా ఉండటం విశేషం. త్వరలో ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ కోసం కోహ్లి బృందంలోని ఒక్కొక్కరికి రోజూవారీ భత్యంగా 125 పౌండ్లు (రూ. 10, 400), బీసీసీఐ అధికారులకు 500 పౌండ్లు (రూ. 41, 600) చెల్లించనున్నారు.
ఆటగాళ్ల కంటే సుమారు 4 రెట్లు అధిక మొత్తం అధికారులకు అందుతోంది. అయితే ఆటగాళ్లలా వార్షిక కాంట్రాక్టు ఫీజుల్లేని అధికారులకు కాస్త ఎక్కువ మొత్తం దక్కడం మంచిదే అయినప్పటికీ అది మరీ నాలుగు రెట్లు ఎక్కువగా ఉండకూడదని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.