లీడ్స్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మూడో టెస్ట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఓ సంచలనాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది. దీని ప్రభావం మూడో టెస్ట్ మ్యాచ్‌పై పడే అవకాశాలు లేకపోలేదు. ఈ అంశం ఇరు జట్ల క్రికెటర్లు, కెప్టెన్ల ఆటతీరు, వారి వ్యూహాలను ప్రభావితం చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ కోహ్లి, ఇంగ్లండ్ సారధి రూట్ మధ్య వాడివేడి వాగ్వాదం నడిచినట్లు తెలుస్తోంది. లార్డ్స్ పెవిలియన్ లాంగ్ రూమ్ వేదికగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ వాగ్వాదంలో ఇరు జట్ల ఆటగాళ్లు గ్రూపులుగా విడిపోయి వ్యక్తిగత దాడుల వరకూ వెళ్లినట్లు బ్రిటిష్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. కోహ్లి, రూట్ అయితే ఏకంగా బాహాబాహికి దిగినట్లు సమాచారం.
రెండో టెస్ట్ మూడో రోజు రూట్ భారీ శతకం సాధించిన అనంతరం ఈ ఘర్షణకు బీజం పడినట్లు తెలుస్తోంది. అప్పుడు 11వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన అండర్సన్‌ను టార్గెట్‌గా చేసుకుని బుమ్రా వరుసగా షార్ట్ పిచ్ బంతులను సంధించిన విషయం తెలిసిందే. బుమ్రా గంటకు 90 మైళ్ల వేగంతో బంతులు సంధించడంతో ఆండర్సన్ గాయలపాలయ్యాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ఆండర్సన్.. ఔటైన అనంతరం బుమ్రాను దూషించడంతో ఇరు జట్ల మధ్య చిన్నపాటి యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి మ్యాచ్ పూర్తయ్యేవరకూ ఇరు జట్ల మధ్య ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. కాగా, ఈ మ్యాచ్ టీమిండియా 151 పరుగుల తేడాతో ఆతిధ్య జట్టును మట్టికరిపించిన సంగతి తెలిసిందే.
చదవండి: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. అశ్విన్‌కు మరోసారి నిరాశే
Comments
Please login to add a commentAdd a comment