
కోహ్లి,ఆఫ్రిది
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తన స్నేహ స్వభావాన్ని చాటుకున్నాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లితో తన స్నేహాన్ని రాజకీయ పరిస్థితులు నిర్వచించలేవని అన్నాడు. వ్యక్తులు, దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి క్రికెటర్లుగా ఆదర్శంగా ఉండాలనేదే తన సిద్ధాంతమని ఆఫ్రిది చెప్పాడు.
‘విరాట్ ఒక అద్భుత వ్యక్తి. ప్రస్తుతం భారత క్రికెట్‌కు అతనే అంబాసిడర్. కోహ్లితో మాట్లాడిన ప్రతీసారి ఆత్మీయ అనుభూతి పొందుతా. అతడికి వివాహ అభినందనలు కూడా తెలిపా. నా స్వచ్ఛంద సంస్థకు సంతకం చేసిన తన జెర్సీని పంపించాడు’ అని ఆఫ్రిది గుర్తుచేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment