
ముంబై: మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మైదానం బయట కూడా తన ఇమేజ్‌తో కాసుల పంట పండిస్తున్నాడు. అమెరికాకు చెందిన ప్రముఖ బిజినెస్ మేగజైన్ ‘ఫోర్బ్స్’ విడుదల చేసిన భారత ధనవంతుల తాజా జాబితాలో కోహ్లి ఓవరాల్‌గా రెండో స్థానంలో... క్రీడాకారుల విభాగంలో తొలి స్థానాన్ని అలంకరించాడు. ఈ ఏడాది కోహ్లి రూ. 228 కోట్ల 9 లక్షలు ఆర్జించినట్లు ‘ఫోర్బ్స్’ పత్రిక తెలిపింది. మహిళల క్రీడాకారిణుల జాబితాలో హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టాప్ ర్యాంక్‌లో నిలిచింది.
ఈ ఏడాది ఆమె మొత్తం రూ. 36 కోట్ల 50 లక్షలు సంపాదించింది. ఓవరాల్ జాబితాలో సింధు 20వ ర్యాంక్‌లో ఉంది. రూ. 16 కోట్ల 54 లక్షలతో మరో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ 58వ ర్యాంక్‌లో నిలిచింది. భారత ధనవంతుల టాప్–100 జాబితాలో 21 మంది క్రీడాకారులకు చోటు లభించింది. రూ. 101 కోట్ల 77 లక్షల సంపాదనతో ధోని 5వ ర్యాంక్‌లో... రూ. 80 కోట్లతో సచిన్ టెండూల్కర్ 9వ ర్యాంక్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment