
కోహ్లీ చెప్పాడు.. టీం సభ్యులు పాటించారు!
ఐపీఎల్ చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు చేసిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్ చరిత్రలోనే ఒక మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు చేసిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2013 ఐపీఎల్‌లో పూణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 20 ఓవర్లలో 263 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది. అయితే.. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగులకే ఆలౌటై ఐపీఎల్‌లో అతి తక్కువ స్కోరు నమోదు చేసిన జట్టుగా కూడా ఆర్‌సీబీ రికార్డులకెక్కింది. ఆర్సీబీ చెత్త ప్రదర్శనపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.
ఆర్‌సీబీ కొత్త టోల్ నంబర్(70189820250)ను అనౌన్స్ చేసిందని ఆ జట్టు సభ్యులు చేసిన గణాంకాలను సోషల్ మీడియా యూజర్లు చూపుతున్నారు. కొందరైతే.. ఆర్‌సీబీ మొత్తం స్కోరు(49)ను అంతకుముందు రోజు మ్యాచ్‌లో ధోని టోటల్ స్కోర్(61)తో పోల్చి విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇంకొందరు మాత్రం కోహ్లీ తన టీం సభ్యులకు 10 ఓవర్లలో మ్యాచ్ అయిపోవాలని చెప్పగా.. వారు పాటించారని, అంతుకే ఫలితం ఇలా ఉందని అంటున్నారు. ఏదేమైనా ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వస్తున్న కామెంట్స్ కోహ్లీ అభిమానులకు మింగుడుపడటం కష్టంగానే ఉంది.
**Kohli in dressing room**
— Nabarun D (@NabarunD1) 23 April 2017
Kohli-Finish dis match in 10 overs
Team- Sure captain.
Result:49 all out in 9.4 overs#KKRvRCB#Gambhir@KKRiders