
దుబాయ్: ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన రోజే విరాట్ కోహ్లి మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. గురువారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అతను తొలిసారి 900 రేటింగ్ పాయింట్లు సాధించాడు. దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ (916 పాయింట్లు–1979లో) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. తాజా పాయింట్లతో అతను వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం 947 పాయింట్లతో స్మిత్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. గత వారం 880 పాయింట్లతో ఉన్న కోహ్లి సెంచూరియన్ టెస్టులో 153 పరుగులు సాధించడంతో అతని ఖాతాలో మరో 20 పాయింట్లు చేరాయి. ఇంగ్లండ్‌పై 1979 (ఓవల్)లో తన 50వ టెస్టులో 221 పరుగులు సాధించినప్పుడు గావస్కర్ 916 పాయింట్లకు చేరుకున్నాడు.
గతంలో భారత ఆటగాళ్లు సచిన్ (898), ద్రవిడ్ (892) ఈ మార్క్‌కు చేరువగా వచ్చినా దానిని అందుకోలేకపోయారు. ఓవరాల్‌గా 900 రేటింగ్ పాయింట్ల మైలురాయిని అందుకున్న 31వ బ్యాట్స్‌మన్ కోహ్లి. డాన్ బ్రాడ్‌మన్ 961 పాయింట్లతో ఆల్‌టైమ్ టాప్‌గా నిలిచాడు. బ్యాటింగ్ టాప్–10లో భారత్ తరపున పుజారా (ఆరో స్థానం), బౌలర్ల జాబితాలో జడేజా (3), అశ్విన్ (5) కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా 2, అశ్విన్ మూడో స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment