అత్యుత్తమ ఫీల్డర్లలో రవీంద్ర జడేజా ఒకడు. అయితే కొన్ని సందర్భాల్లో ఎంతటి స్టార్ ఫీల్డర్‌కైనా వైఫల్యం తప్పదు. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు జడేజా ఫీల్డింగ్‌లో తడబడ్డాడు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సునీల్ నరైన్ ఇచ్చిన వరుస క్యాచ్‌లను అందుకోవడంలో జడేజా విఫలమయ్యాడు.