
ముంబై: సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు మరోసారి వన్డే జట్టులో చోటు దక్కలేదు. విరాట్ కోహ్లి నేతృత్వంలో ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగే ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొనే 17 మంది సభ్యుల భారత జట్టును శనివారం ప్రకటించారు. ఈ పర్యటనలో రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మణికట్టు స్పిన్ ద్వయం యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లపైనే సెలెక్టర్లు నమ్మకముంచారు. వీరికితోడుగా అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు. గాయం కారణంగా శ్రీలంక సిరీస్‌కు దూరమైన బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ చోటు నిలబెట్టుకోగా... ముంబై పేసర్ శార్దుల్ ఠాకూర్ పునరాగమనం చేశాడు. బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ తొలి విదేశీ పర్యటన చేయనున్నాడు. ఇటీవల టెస్టు జట్టుకే పరిమితం చేస్తున్న పేసర్ మొహమ్మద్ షమీని వన్డేలకూ పరిగణనలోకి తీసుకోవడం విశేషం. లంకతో వన్డేలకు జట్టులోకి ఎంపిౖకైన సిద్దార్థ్ కౌల్‌ను పక్కన పెట్టారు. దక్షిణాఫ్రికాతో ఫిబ్రవరి 1, 4, 7, 10, 13, 16 తేదీల్లో వన్డేలు జరగనున్నాయి.
భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, రహానే, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, ధోని, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, షమీ, బుమ్రా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్.
Comments
Please login to add a commentAdd a comment