aswin
-
WTC ఫైనల్లో ఇషాన్ కిషన్ బెస్ట్ ఎందుకంటే..!
-
టీమ్ ఇండియాకి గుడ్ న్యూ,స్ WTC ప్రైజ్ మనీ ఎంతంటే...
-
‘మనకెందుకులే’ అని వదిలేయలేదు.. కోతికి ఊపిరి పోశాడు
Man Resuscitating Monkey Viral Video: మనం నెట్టింట మనుషులు జంతువులను కాపాడిన వీడియోలను అనేకం చూశాం. అంతేకాదు కొన్ని జంతువులు తమ తోటి జంతువులను లేదా తమ విరోధి జంతువులను సైతం కాపాడిని వీడియోలను చూశాం. కానీ ఇక్కడొక వ్యక్తి ఒక చిన్న కోతిపిల్లకు మనిషికి చేసినట్లుగా సపర్యలు చేసి మరీ బతికించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. (చదవండి: 77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!) అసలు విషయంలోకెళ్లితే...తమిళనాడుకి చెందిన వ్యక్తి కుక్కల గుంపు దాడిలో స్రృహ తప్పి పడిపోయిన ఎనిమిది నెలల కోతి పిల్లను బతికించడానికి శతవిధాల ప్రయత్నిస్తాడు. ఈ మేరకు ఆ వ్యక్తి ఆ కోతి ఛాతిని గట్టిగా నోక్కడం, నోటితో శ్వాస అందించడం వంటి ప్రయత్నాలతో ప్రాణం పోస్తాడు. చివరికి ఆ కోతి కళ్లు తెరవంగానే ఆ వ్యక్తి ముఖం చిరునవ్వుతో వెలిగిపోతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధా రామెన్ సోషల్ మీడియోలో పోస్ట్ చేయడం కాక సదరు వ్యక్తిని "ప్రభు" అంటూ ప్రశంసించారు. అంతేకాదు భారత క్రికెటర్ ఆర్ అశ్విన్‌ని సైతం ఈ వీడియో కదిలించడంతో ఆయన కూడా ఈ వీడియోకి" నాకు ఆ కోతి బతుకుతుందని ఆశ ఉంది"అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: అదేం కక్కుర్తిరా నీకు!... ఏకంగా పది కరోనా వ్యాక్సిన్లు వేయించుకుంటావా!) There is hope 🙏🙏👏 https://t.co/wt3yNTDlk1 — Ashwin 🇮🇳 (@ashwinravi99) December 13, 2021 -
ఆలస్యమైనా... అద్భుతమే
1947 నుంచి టీమిండియా 11 సార్లు ఆస్ట్రేలియాలో పర్యటించింది. 44 టెస్టులాడితే ఐదే గెలిచింది. వీటిలోనూ సిరీస్‌లోని మొదటి టెస్టును ఎన్నడూ నెగ్గలేదు. 2003–04 సిరీస్‌లో రెండో టెస్టును నెగ్గి ఆధిక్యంలో నిలవడమే ఇప్పటివరకు అత్యుత్తమం. ఈసారి మాత్రం పరిస్థితులు కలిసొస్తేనేమి? జట్టు బలంగా ఉన్నందుకైతేనేమి? కోహ్లి సేన తొలి మ్యాచ్‌లోనే నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ ప్రక్రియలో కొంత ఆలస్యమైనా, అద్భుతం అనదగ్గ రీతిలో ‘సిరీస్ వేట’ను ఆరంభించింది. ఇదే ఊపు కొనసాగిస్తే సిరీస్ గెలవాలనే చిరకాల కోరికను మూడో టెస్టులోపే ఖాయం చేసుకోవచ్చు. వారు న్యాయం చేశారు... జట్టు నుంచి పూర్తిగా తీసేయలేక, అలాగని మొత్తానికి కొనసాగించలేని పరిస్థితి పుజారా, రహానేలది. గత రెండు విదేశీ సిరీస్‌లలో వారికిదే అనుభవమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటన ఈ ఇద్దరికీ వ్యక్తిగతంగా చాలా కీలకం. కెప్టెన్ కోహ్లి సహా టాపార్డర్ విఫలమైన అత్యంత కీలక సందర్భాన తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదడం ద్వారా పుజారా తన సత్తా ఏమిటో చాటాడు. జట్టును సురక్షిత స్థానానికి చేర్చాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడి పాత్రను తక్కువ చేయలేం. ఇక... ఆధిక్యాన్ని సాధ్యమైనంత మేర పెంచాల్సిన స్థితిలో రెండో ఇన్నింగ్స్‌లో రహానే చేసిన అర్ధశతకం మెచ్చుకోదగ్గది. ఇది అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ఇద్దరి రాణింపుతో కోహ్లి అరుదైన వైఫల్యం ప్రభావం చూపలేకపోయింది. తక్కువే అయినా, యువ రిషభ్ పంత్ చేసిన పరుగులూ విలువైనవే. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో అతడి ఎదురుదాడి మున్ముందు లయన్ లయను దెబ్బతీసేందుకు మిగతా బ్యాట్స్‌మెన్‌కు ఓ మార్గం చూపింది. రెండో ఇన్నింగ్స్‌లో చేసిన స్కోరుతో ఓపెనర్ కేఎల్ రాహుల్ తన స్థానాన్ని కనీసం మరో టెస్టుకైనా పొడిగించుకున్నాడు. బౌలర్ల సమష్టి ప్రదర్శనతో మన జోరును ఆపడం ఆతిథ్య జట్టు తరం కాలేదు. నోబాల్స్ సమస్యను పక్కన పెడితే ఇషాంత్ శర్మ ఎప్పటిలానే మెరుపు బంతులేయగా, కొంత ఇబ్బందిపడ్డా షమీ తర్వాత తేరుకుని ప్రభావం చూపాడు. అయితే, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అశ్విన్, బుమ్రా గురించే. కొంతకాలంగా విదేశీ పర్యటనల్లో వైఫల్యాలతో ఇబ్బంది ఎదుర్కొంటున్న అశ్విన్ ఈ టెస్టుతో దానిని అధిగమించాడు. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లోనే కాదు... సంప్రదాయ క్రికెట్లోనూ తాను ప్రమాదకారినని బుమ్రా చాటిచెప్పాడు. అడిలైడ్‌లో కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ గతిని మార్చాడు. ఆ రెండు స్థానాలే... జట్టుగా సాధించిన ఈ విజయంలోనూ సరిచేసుకోవాల్సిన కొన్ని లోపాలున్నాయి. అందులో మొదటిది ఓపెనింగ్ స్థానం. మురళీ విజయ్ వైఫల్యాల నుంచి బయటపడలేదు. దీంతో స్థానం కోల్పోక తప్పని పరిస్థితి. రెండో టెస్టు నాటికి కోలుకుంటే పృథ్వీ షా అతడి స్థానంలోకి వచ్చేస్తాడు. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ అరుదైన అవకాశాన్ని మరోసారి చేజార్చుకున్నాడు. ధాటైన బ్యాటింగ్‌తో పరుగులు సాధించడం అటుంచి, టెస్టు క్రికెట్‌కు తగిన ఆటగాడేనా అన్న అనుమానాలు మళ్లీమళ్లీ రేకెత్తిస్తున్నాడు. దీంతో ఉపయుక్తమైన ఆఫ్‌స్పిన్ వేయగల హనుమ విహారిని కాదని... రోహిత్‌ను తీసుకోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు వస్తున్నాయి. బహుశా పెర్త్ టెస్టుకు రోహిత్‌నూ పక్కన పెట్టొచ్చు. ఈ నేపథ్యంలో కుదురుగా ఉన్న పృథ్వీ, విహారి జత కలిస్తే జట్టు మరింత బలీయం కావడం ఖాయం. తద్వారా ‘సిరీస్’ దక్కడమూ ఖాయం. –సాక్షి క్రీడావిభాగం -
ధర తగ్గినా..దుమ్మురేపిన స్టోక్స్!
-
చివరి సెషన్లో పుంజుకున్న భారత్
-
పోరాడి... పైచేయి
ఓపెనర్లు శుభారంభం అందించారు. ఆపద్బాంధవుడు ఆమ్లా నిలిచాడు. కెప్టెన్ డు ప్లెసిస్ కుదురుకున్నాడు. ఇంకా డికాక్ రావాల్సి ఉంది. పరిస్థితి చూస్తే ఆతిథ్య జట్టు ఆధిపత్యంతో తొలి రోజు ముగిసేలా ఉంది. కానీ భారత్ పుంజుకుంది. రెండు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. సెంచూరియన్ టెస్టులో తేరుకుంది. రెండో రోజు భారత్ చేయాల్సిందల్లా దక్షిణాఫ్రికాను సాధ్యమైనంత త్వరగా ఆలౌట్ చేయడం... బ్యాటింగ్‌లో ప్రతాపం చూపడం! సెంచూరియన్: ఒకరు ఇబ్బందిగా కదిలితే... మరొకరు సాధికారికంగా ఆడారు... ఇంకొకరు నిలదొక్కుకుంటే... అవతలివైపు వారు దూకుడు చూపారు... తమకు పెట్టని కోటలాంటి రెండో టెస్టు వేదిక సూపర్ స్పోర్ట్ పార్క్ పిచ్‌పై శనివారం సఫారీల ఇన్నింగ్స్ సాగిన తీరిది. అప్పుడప్పుడు ఓ వికెట్ అన్నట్లుగా సాగిన భారత్ బౌలింగ్‌ను రెండు సెషన్ల పాటు ధీమాగా ఆడింది. ప్రతి బ్యాట్స్‌మన్ తలా కొన్ని పరుగులు అందించడంతో మెరుగైన స్కోరు దిశగా కదిలింది. అయితే... చివర్లో రనౌట్లతో తడబడి వికెట్లు చేజార్చుకుంది. అంతకుముందు ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (150 బంతుల్లో 94; 15 ఫోర్లు), డిపెండబుల్ బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా (153 బంతుల్లో 82; 14 ఫోర్లు) రాణించడంతో ప్రొటీస్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 269 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (77 బంతుల్లో 24 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్ (23 బంతుల్లో 10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్‌కు ఒకటి దక్కింది. రెండు సెషన్లు వారివే... పేస్ స్వర్గధామంగా పేరొందిన పిచ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు ఎల్గర్ (83 బంతుల్లో 31; 4 ఫోర్లు), మార్క్రమ్ పట్టుదలగా ఆడారు. ఎల్గర్ తడబడుతుండటంతో స్పిన్నర్ అశ్విన్‌ను ముందే బౌలింగ్‌కు దింపినా లంచ్ వరకు భారత్‌కు వికెట్ దక్కలేదు. తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించాక అతడు అశ్విన్‌కే చిక్కాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఆమ్లా కూడా ఏమంత సౌకర్యంగా కనిపించలేదు. 14, 30 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. మార్క్రమ్ మాత్రం మొదటి నుంచి చక్కగా ఆడాడు. పేసర్లను దీటుగా ఎదుర్కొంటూ బౌండరీలు కొట్టాడు. రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించాక... శతకం ఖాయం అనుకుంటున్న దశలో అశ్విన్ బౌలింగ్‌లో లేట్ కట్కు యత్నించి పార్థివ్ పట్టిన చురుకైన క్యాచ్‌కు అతను వెనుదిరిగాడు. దీంతో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ (48 బంతుల్లో 20; 2 ఫోర్లు) తన సహజ తీరుతో ఆడేందుకు యత్నించాడు. రివర్స్ స్వీప్‌తో ఫోర్ కొట్టాడు. మూడో వికెట్‌కు 51 పరుగులు జత చేశాక... ఇషాంత్ బంతిని వికెట్ల మీదకు ఆడుకుని బౌల్డయ్యాడు. ఈ సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు 199. తర్వాత ఆమ్లా, డుప్లెసిస్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆడారు. పాండ్యా ఈసారి రనౌట్లతో... మరో 9 ఓవర్లే మిగిలాయి. స్కోరు 246/3. దీంతో దక్షిణాఫ్రికా మెరుగ్గానే రోజును ముగించేలా కనిపించింది. ఇక్కడే... హార్దిక్ పాండ్యా ఆటను మలుపు తిప్పాడు. తొలి టెస్టులో ఇటు బ్యాట్, అటు బంతితో ముద్ర వేసిన ఈ యువ ఆల్‌రౌండర్ ఈసారి రనౌట్ల రూపంలో జట్టుకు ఉపయోగ పడ్డాడు. తన బౌలింగ్‌లో బంతిని షార్ట్ లెగ్‌లోకి ఆడి పరుగుకు ప్రయత్నించిన ఆమ్లాను అతడు డైరెక్ట్ హిట్ ద్వారా పెవిలియన్‌కు పంపాడు. ఫాలో త్రూలో బంతిని అందుకుని మరీ నేరుగా వికెట్లకు కొట్టిన ఈ రనౌట్ తొలి రోజు ఆటలో హైలైట్. పాండ్యా మరుసటి ఓవర్లోనే ఫిలాండర్ లేని పరుగుకు యత్నించి అవుటయ్యాడు. ఈసారీ పాండ్యా ఫాలో త్రూలో బ్యాట్స్‌మన్ క్రీజు వద్దకు వచ్చి పార్థివ్ నుంచి బంతిని అందుకుని వికెట్లను గిరాటేయడం గమనార్హం. అంతకుముందు డికాక్ (0)ను అద్భుత బంతితో అశ్విన్ వెనక్కి పంపడంతో ప్రత్యర్థి 5 పరుగుల తేడాతో 3 వికెట్లు కోల్పోయింది. ఒక్కసారిగా 251/6కు పడిపోయింది. అశ్విన్ చమక్... సెంచూరియన్‌లో అసలు స్పిన్నర్‌కు చోటుంటుందా అని భావించే పరిస్థితుల్లో కూడా రవిచంద్రన్ అశ్విన్ (3/90) ప్రభావం చూపాడు. 20వ ఓవర్లోనే బౌలింగ్‌కు దిగి ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 31 ఓవర్లు వేయడంతో పాటు ఓపెనర్లు సహా ప్రమాదకర డికాక్‌ను అవుట్ చేశాడు. అశ్విన్ బౌలింగ్ బాగా పడుతుండటం చూసి కోహ్లి... సుదీర్ఘ స్పెల్స్(17–8–6) వేయిం చాడు. దీనికి తగ్గట్లే అతడు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మన పేస్ సాదాసీదాగానే... భారత్ బౌలింగ్ దాడిని బుమ్రా, షమీ ప్రారంభించారు. అడపాదడపా మంచి బంతులేసినా పిచ్‌కు తగ్గట్లు పదును చూపలేకపోయారు. వీరిని మార్క్రమ్ అవలీలగా ఎదుర్కొన్నాడు. షమీ అయితే ఓవర్‌కు సగటున 4 పరుగులు ఇచ్చాడు. దీంతో అశ్విన్‌ను ముందే దింపాల్సి వచ్చింది. షమీ ఆట మధ్యలో తలనొప్పి కారణంగా మైదానం వీడాడు. మరోవైపు ఇషాంత్ (1/32) పరుగుల కట్టడితో పాటు ప్రమాదకరంగా కనిపించాడు. డివిలియర్స్‌ను అవుట్ చేశాడు. లేదు... కాదంటూనే మూడు మార్పులు తుది జట్టు ఆటగాళ్ల కూర్పుపై శుక్రవారం తీవ్రంగా స్పందించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అసలు టెస్టు సమయానికి వచ్చేసరికి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా మూడు మార్పులతో బరిలో దిగాడు. పరిస్థితులరీత్యా తప్పక ఉంటారని భావించినప్పటికీ ఓపెనర్ శిఖర్ ధావన్, కీపర్ సాహా, పేసర్ భువనేశ్వర్‌లను పక్కన పెట్టాడు. కేఎల్ రాహుల్, పార్థివ్ పటేల్, ఇషాంత్ శర్మలకు చోటిచ్చాడు. అన్నిటికి మించి తొలి టెస్టులో బౌలర్‌గా సత్తాచాటి, బ్యాటింగ్‌లో అధిక బంతులు ఆడిన భువీని.... బౌన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఇషాంత్‌ను తీసుకోవడం కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. ఎన్ని వైపుల నుంచి ఒత్తిడి వచ్చినా రహానేకు అవకాశం ఇవ్వకుండా రోహిత్ శర్మపైనే నమ్మకముంచాడు. -
6,7,8 నిలిచేవారెవరు?
2014 డిసెంబర్ 13... వేదిక అడిలైడ్. ప్రత్యర్థి ఆస్ట్రేలియా. మ్యాచ్ చివరి రోజు లక్ష్యం 364. మురళీ విజయ్ (99), విరాట్ కోహ్లి (141) అద్భుతంగా ఆడుతున్నారు. భారత్ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఇంతలో శతకం చేజార్చుకుంటూ విజయ్ అవుటయ్యాడు. అప్పటికి చేయాల్సింది 122 పరుగులే. మరో ఎండ్‌లో కోహ్లి పాతుకుపోయాడు. కానీ... తర్వాత అతడికి సహరించేవారు కరవయ్యారు. 78 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయిన భారత్ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. (ఈ జట్టులో అశ్విన్, జడేజా లేరు). 2015 నవంబర్... చండీగఢ్‌లో భారత్, దక్షిణాఫ్రికా టెస్టు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 154 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జడేజా (38), అశ్విన్ (20) ఎనిమిదో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఈ ఇన్నింగ్స్‌లో వీరిద్దరిదే రెండో అత్యధిక భాగస్వామ్యం. రెండు జట్ల తరఫున స్వల్ప స్కోర్లు నమోదైన ఈ టెస్టులో భారత్ 108 పరుగులతో గెలిచింది. ...ఈ రెండు ఉదాహరణలు స్వదేశంలో అయినా, విదేశంలో అయినా టెస్టుల్లో 6,7,8 స్థానాల్లో బ్యాటింగ్ చేయగలిగినవారి ప్రాధాన్యతను చాటుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేపడితే ప్రధాన బ్యాట్స్‌మెన్‌కు అండగా నిలుస్తూ, తమవంతుగా పరుగులు చేస్తూ భారీ స్కోరుకు దోహదపడటం, రెండోసారి బ్యాటింగ్ చేయాల్సి వస్తే ప్రత్యర్థి స్కోరును అందుకునేందుకు నిచ్చెనలా నిలవడం ఈ స్థానాల్లో ఆడేవారి బాధ్యత. ఒకవేళ బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమైతే ఫాలోఆన్ ప్రమాదాన్ని తప్పిస్తూ గౌరవప్రదమైన స్కోరుకు పాటుపడటం వీరి విధి. స్వదేశంలో ఈ విషయంలో మన జట్టుకు ఢోకా లేదు. కూర్పు మారిపోయి అదనంగా పేసర్‌ను ఆడించాల్సిన విదేశాల్లోనే ఈ ఇబ్బందంతా. భారత్ ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతి ప్రకారం ఓపెనర్లు, పుజారా, కోహ్లి, రహానే/రోహిత్‌లు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా తొలి అయిదు స్థానాల్లో వస్తారు. ఆరో నంబరు వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహాది. ఇక్కడ ఎలాగూ స్పిన్ పిచ్లే కాబట్టి అశ్విన్, జడేజా 7, 8 స్థానాల్లో ఆడేవారు. మ్యాచ్ పరిస్థితులరీత్యా కొంత మారినా అటుఇటుగా ఈ ముగ్గురిది మాత్రం ఇదే బ్యాటింగ్ ఆర్డర్. బయట మాత్రం ఇది చెల్లుబాటు కాదు. విదేశాల్లో కూర్పు మార్పు... అయిదుగురు బ్యాట్స్‌మెన్, కీపర్, ఒక ఆల్‌రౌండర్, ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లు. బహుశా సఫారీ టూర్లో ఇదే భారత్ వ్యూహం. అలవాటైన వికెట్లపై మన బ్యాట్స్‌మన్ స్వదేశంలో పరుగుల వరద పారించేవారు. లోయర్ ఆర్డర్ ఆడినా, ఆడకున్నా ప్రభావం కనిపించేది కాదు. విదేశాల్లో విజయం సాధించాలంటే మాత్రం సమష్టిగా ఆడాల్సిందే. చివరి శ్రేణిలోని బౌలింగ్ ఆల్‌రౌండర్లు... టాప్, మిడిలార్డర్‌కు దన్నుగా నిలవాల్సిందే. వారు తమవంతుగా 20లు 30లైనా జత చేయాలి. అయితే పూర్తి పేస్ పిచ్‌లుండే దక్షిణాఫ్రికాలో ఒక్క స్పిన్నర్‌తోనే బరిలో దిగాల్సి ఉంటుంది. ఈ ప్రకారం 6, 7 స్థానాల్లో సాహా, హార్దిక్ పాండ్యా, 8లో అశ్విన్ వస్తారు. సరిగ్గా వీరే గెలుపునకు కీలకం అవుతారు. దేశంలో నంబర్‌వన్ టెస్టు కీపర్‌గా పేరున్న సాహా... మూడేళ్ల క్రితం ఆసీస్‌లో కీలక సమ యంలో అనవసర దూకుడు కనబర్చి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే గతేడాది వెస్టిండీస్‌లో శతకం సాధించి వాటికి తగిన జవాబిచ్చాడు. తెలివైన క్రికెటర్‌గా అశ్విన్ ఎక్కడైనా ఉపయోగపడేవాడే. దక్షిణాఫ్రికా బౌలింగ్ దాడిని కాచుకుంటూ వీరు నమోదు చేసే భాగస్వామ్యాలే జట్టుకు విలువైనవిగా మారతాయనడంతో సందేహం లేదు. హార్దిక్ ఏం చేస్తాడో...? పేస్ ఆల్‌రౌండర్‌గా తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తున్న హార్దిక్ పాండ్యాకు ఈ సిరీస్ కీలకం కానుంది. ఇటీవలే లంకపై అరంగేట్రం చేసిన పాండ్యా శతకం కూడా సాధించాడు. భారీ హిట్టింగ్తో బ్యాట్స్‌మన్‌గా నిరూపించుకున్న పాండ్యా... తన పేస్ పదును చూపాల్సిన సమయం వచ్చింది. మ్యాచ్ స్థితికి అనుగుణంగా తనను తాను మలుచుకోవాల్సి ఉంటుంది. తద్వారా ‘కోహ్లికి పాండ్యా ఒక ఆయుధం’ అన్న మాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యలకూ సార్థకత చేకూర్చిన వాడవుతాడు. అచ్చొచ్చే(నా) ‘9’ 9... ఈ సంఖ్యను చాలామంది ఇష్టపడతారు. ఇదే సంఖ్య సఫారీ పర్యటనలో భారత జట్టుకూ ఎంతోకొంత ఉపయోగపడుతుందేమో చూడాలి. ఎందుకంటే ఈ స్థానంలో బ్యాటింగ్ వచ్చేది పేసర్ భువనేశ్వర్. కొంతకాలంగా బౌలింగ్‌లో 140 కి.మీ. వేగం అందుకుంటున్న భువీ బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేస్తున్నాడు. శ్రీలంకతో వన్డేలో బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట అతడు సాధించిన అర్ధ సెంచరీ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించింది. స్ట్రోక్స్ ఆడటంలోనూ భువీ మెరుగయ్యాడు. ఈ నేప థ్యంలో దక్షిణాఫ్రికాలోనూ జట్టు బ్యాటింగ్ ప్రయోజనాలకు ఉపయోగపడతామో చూడాలి. చేజారితే మ్యాచ్ పోయినట్లే... అవి అసలు సిసలు పేస్ పిచ్‌లు... బ్యాట్ అంచులకు తగిలిన బంతి స్లిప్‌లోకి వచ్చేందుకు క్షణం కూడా పట్టదు. అలాంటివాటిని ఒడిసిపట్టాలంటే ఫీల్డర్‌కు ఓపికతో పాటు తీక్షణత అవసరం. గతంలో భారత్‌కు ఈ ఏరియాలో రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్ వంటివారు పెట్టని కోటగా ఉండేవారు. ప్రస్తుత జట్టులో రహానే తప్ప... స్లిప్ స్పెషలిస్టుల లోటు కనిపిస్తోంది. ఇతడికి తోడుగా మరో చురుకైన ఆటగాడిని ఎంచుకోవాలి. కోహ్లి... ఇటీవలి శ్రీలంక సిరీస్‌లో తరచూ స్లిప్ ఫీల్డర్లను మార్చి ప్రయోగం చేసినా ఫలితం రాబట్టలేకపోయాడు. పైగా విలువైన క్యాచ్‌లు నేలపాలయ్యాయి. ఇదే తీరు ఎల్గర్, ఆమ్లా, డివిలియర్స్, డుప్లెసిస్, డికాక్ వంటి బ్యాట్స్‌మన్ ఉన్న దక్షిణాఫ్రికాపైనా కొనసాగితే విజయం గురించి ఆలోచించడం సాహసమే అవుతుంది. ఒంటిచేత్తో ఫలితాన్ని మార్చేసే ఇలాంటివారి క్యాచ్‌లు చేజారిస్తే మ్యాచ్‌లో తిరిగి కోలుకోవడం కష్టం. ధావన్ సిద్ధం... జడేజా అనుమానం! భారత ఓపెనర్ శిఖర్ ధావన్ పూర్తి ఫిట్నెస్తో తొలి టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. అయితే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అస్వస్థత జట్టును కలవరపరుస్తోంది. రేపటి నుంచి కేప్‌టౌన్ టెస్టు ప్రారంభమవుతుండగా... అతను వైరల్ జ్వరం బారిన పడ్డాడు. ‘ధావన్ ఫిట్‌గా ఉన్నాడు. చీలమండ గాయంతోనే సఫారీకి బయల్దేరిన అతను తొలి టెస్టు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని బీసీసీఐ తెలిపింది. రెండు రోజులుగా వైరల్ జ్వరం బారిన పడిన జడేజాను బీసీసీఐ వైద్య సిబ్బంది, స్థానిక వైద్యులు పరీక్షించారు. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతను తుది జట్టులో ఉండేది లేనిది శుక్రవారమే తెలుస్తుంది. -
అశ్విన్, జడేజాలకు మళ్లీ నిరాశ
ముంబై: సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు మరోసారి వన్డే జట్టులో చోటు దక్కలేదు. విరాట్ కోహ్లి నేతృత్వంలో ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగే ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొనే 17 మంది సభ్యుల భారత జట్టును శనివారం ప్రకటించారు. ఈ పర్యటనలో రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మణికట్టు స్పిన్ ద్వయం యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లపైనే సెలెక్టర్లు నమ్మకముంచారు. వీరికితోడుగా అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు. గాయం కారణంగా శ్రీలంక సిరీస్‌కు దూరమైన బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ చోటు నిలబెట్టుకోగా... ముంబై పేసర్ శార్దుల్ ఠాకూర్ పునరాగమనం చేశాడు. బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ తొలి విదేశీ పర్యటన చేయనున్నాడు. ఇటీవల టెస్టు జట్టుకే పరిమితం చేస్తున్న పేసర్ మొహమ్మద్ షమీని వన్డేలకూ పరిగణనలోకి తీసుకోవడం విశేషం. లంకతో వన్డేలకు జట్టులోకి ఎంపిౖకైన సిద్దార్థ్ కౌల్‌ను పక్కన పెట్టారు. దక్షిణాఫ్రికాతో ఫిబ్రవరి 1, 4, 7, 10, 13, 16 తేదీల్లో వన్డేలు జరగనున్నాయి. భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, రహానే, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, ధోని, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, షమీ, బుమ్రా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్. -
మనోళ్లు న్యూజిలాండ్‌ను తిప్పేస్తున్నారు..
కాన్పూర్: న్యూజిలాండ్‌తో తొలిటెస్టు మూడో రోజు శనివారం భారత స్పిన్నర్లు రాణిస్తున్నారు. ఆట ఆరంభమైన కాసేపటికే అశ్విన్, జడేజా వెంటవెంటనే మూడు వికెట్లు పడగొట్టి కివీస్‌కు షాకిచ్చారు. 152/1 ఓవర్‌నైట్ స్కోరుతో న్యూజిలాండ్ ఆటగాళ్లు లాథమ్, విలియమ్సన్ ఈ రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించారు. న్యూజిలాండ్ మరో 7 పరుగుల తర్వాత వికెట్ కోల్పోయింది. అశ్విన్ లాథమ్‌ను అవుట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లో జడేజా.. టేలర్‌ను డకౌట్ చేశాడు. వీరిద్దరూ ఎల్బీగా వెనుదిరిగారు. కాసేపటి తర్వాత అశ్విన్ విలియమ్సన్‌ను బౌల్డ్ చేశాడు. అనంతరం ల్యూక్ రోంచీ(33)ను ఎల్బీ డబ్యూగా జడేజా పెవిలియన్‌కు పంపాడు. దీంతో కివీస్ 219 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. -
అశ్విన్ అదుర్స్
జింఖానా, న్యూస్‌లైన్: కాస్మోస్ బౌలర్ అశ్విన్ (5/16) వికెట్లు పడగొట్టి నోబుల్ సీసీ జట్టును కట్టడి చేశాడు. దీంతో ఎ-డివిజన్ వన్డే లీగ్ భాగంగా నోబుల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కాస్మోస్ జట్టు 24 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత కాస్మోస్ జట్టు 7 వికెట్లకు 150 పరుగులు చేసింది. దినేష్ పవార్ (60) అర్ధ సెంచరీతో రాణించగా... నరేందర్ 35 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. నోబుల్ సీసీ బౌలర్ అభినయ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బరిలోకి దిగిన నోబుల్ సీసీ 126 పరుగుల వద్ద ఆలౌటైంది. తేజ (30) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. కరణ్ వైష్ణవ్ 3 వికెట్లు చేజిక్కించుకున్నాడు. మరో మ్యాచ్‌లో కోల్ అక్రిలిక్ జట్టు బ్యాట్స్‌మెన్ అల్తాఫ్ యూనస్ (95), సూర్య దేవ్ కుమార్ (69) అర్ధ సెంచరీలతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించారు. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో అక్రిలిక్ జట్టు 156 పరుగుల తేడాతో రిలయన్స్ జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట అక్రిలిక్ 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. రిలయన్స్ బౌలర్లు అలంక్రిత్ 3, రిషబ్ 4 వికెట్లు పడగొట్టారు. తర్వాత లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రిలయన్స్ 9 వికెట్ల నష్టానికి 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రతీక్ 39 పరుగులు చే శాడు. అక్రిలిక్ బౌలర్ అఫ్తాబ్ 4 వికెట్లు తీసుకున్నాడు. -
చెమటోడ్చిన ఇషాంత్, అశ్విన్
దుబాయ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌లో రెండు వన్డేలు వర్షం కారణంగా రద్దు కావడం భారత జట్టుకు కలిసివచ్చింది. ఈ కారణంగా తాజా ఐసీసీ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్‌లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ సిరీస్‌ను ఆసీస్ 6-1తో గెలుచుకుంటే నంబర్‌వన్ దక్కించుకునేది. ఇప్పుడు మిగిలిన రెండు వన్డేలు నెగ్గినా వారి ప్రయత్నం నెరవేరదు. అయితే వారి పాయింట్లు మాత్రం 119కి చేరుతాయి. భారత్ 120 పాయింట్లతో ఉంటుంది. ఒకవేళ భారత్ ఆ రెండు మ్యాచ్‌లు నెగ్గితే 123 పాయింట్లు సాధిస్తుంది. ఆసీస్ 114 పాయింట్లకు పడిపోతుంది. నాగ్‌పూర్: పేలవ ఫామ్‌తో ఇబ్బందులెదుర్కొంటున్న పేసర్ ఇషాంత్ శర్మ, స్పిన్నర్ ఆర్.అశ్విన్ నెట్స్‌లో సోమవారం ఇక్కడి వీసీఏ స్టేడియంలో తీవ్రంగా సాధన చేశారు. బుధవారం ఆసీస్‌తో భారత జట్టు కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌ను నిలువరించాలంటే భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లను కచ్చితంగా నెగ్గాల్సి ఉంది. ఇప్పటిదాకా ఆడిన నాలుగు వన్డేల్లో ఇషాంత్ మూడు వికెట్లు మాత్రమే పడగొట్టి ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. డెత్ ఓవర్లో తన ప్రదర్శన జట్టుకు భారంగా మారుతోంది. మూడో వన్డేలో 48వ ఓవర్ వేసిన ఇషాంత్ ఏకంగా 30 పరుగులిచ్చి జట్టును ఓటమిపాలు చేశాడు. దీంతో రాంచీ వన్డేలో జట్టులో లేకుండాపోయాడు. ఇక ఐదో వన్డే రద్దు కావడంతో పాటు నాగ్‌పూర్ వన్డేలోనూ బ్యాటింగ్ పిచ్ సిద్ధమవుతుండడంతో భారత జట్టు బౌలర్లపై మరింత ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇషాంత్, అశ్విన్ ముమ్మర ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. సిరీస్ ముందే గెలుస్తాం: డోహర్తి నాగ్‌పూర్: ఆరో వన్డే విజయంతోనే భారత్‌పై సిరీస్ విజయం సాధిస్తామని ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ జేవియర్ డోహర్తి ధీమా వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్ కోసం చివరి వన్డే దాకా ఎదురుచూడబోమన్నాడు. వర్షంతో రెండు మ్యాచ్‌లు రద్దవడంతో 7 వన్డేల టోర్నీ కాస్త ఇప్పుడు ఐదు వన్డేల సిరీస్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో ఆధిక్యంలో ఉన్న ఆసీస్ ఇక్కడ బుధవారం జరిగే వన్డేలో గెలవాలనే పట్టుదలతో ఉంది. సోమవారం ప్రాక్టీస్ సెషన్ ముగిశాక డోహర్తి మాట్లాడుతూ ‘ఈ మ్యాచ్ గెలిచేందుకే ఇక్కడికొచ్చాం. బెంగళూరు (చివరి మ్యాచ్ వేదిక) వన్డే దాకా భారత్‌కు అవకాశమివ్వం. ఆరో వన్డే మాకంటే ధోని సేనకే కీలకం. చావోరేవో వారికే కాబట్టి... ఒత్తిడంతా భారత్‌పైనే ఉంది’ అని అన్నాడు.