Man Resuscitating Monkey Viral Video: మనం నెట్టింట మనుషులు జంతువులను కాపాడిన వీడియోలను అనేకం చూశాం. అంతేకాదు కొన్ని జంతువులు తమ తోటి జంతువులను లేదా తమ విరోధి జంతువులను సైతం కాపాడిని వీడియోలను చూశాం. కానీ ఇక్కడొక వ్యక్తి ఒక చిన్న కోతిపిల్లకు మనిషికి చేసినట్లుగా సపర్యలు చేసి మరీ బతికించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
(చదవండి: 77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!)
అసలు విషయంలోకెళ్లితే...తమిళనాడుకి చెందిన వ్యక్తి కుక్కల గుంపు దాడిలో స్రృహ తప్పి పడిపోయిన ఎనిమిది నెలల కోతి పిల్లను బతికించడానికి శతవిధాల ప్రయత్నిస్తాడు. ఈ మేరకు ఆ వ్యక్తి ఆ కోతి ఛాతిని గట్టిగా నోక్కడం, నోటితో శ్వాస అందించడం వంటి ప్రయత్నాలతో ప్రాణం పోస్తాడు. చివరికి ఆ కోతి కళ్లు తెరవంగానే ఆ వ్యక్తి ముఖం చిరునవ్వుతో వెలిగిపోతుంది.
అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుధా రామెన్ సోషల్ మీడియోలో పోస్ట్ చేయడం కాక సదరు వ్యక్తిని "ప్రభు" అంటూ ప్రశంసించారు. అంతేకాదు భారత క్రికెటర్ ఆర్ అశ్విన్‌ని సైతం ఈ వీడియో కదిలించడంతో ఆయన కూడా ఈ వీడియోకి" నాకు ఆ కోతి బతుకుతుందని ఆశ ఉంది"అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి.
(చదవండి: అదేం కక్కుర్తిరా నీకు!... ఏకంగా పది కరోనా వ్యాక్సిన్‌లు వేయించుకుంటావా!)
There is hope 🙏🙏👏 https://t.co/wt3yNTDlk1
— Ashwin 🇮🇳 (@ashwinravi99) December 13, 2021
Comments
Please login to add a commentAdd a comment