జార్ఖండ్ తరఫున టాప్‌స్కోరర్‌గా నిలి చినా... ఎమ్మెస్ ధోని (64 బంతుల్లో 44; 4 ఫోర్లు) తన జట్టును గెలిపించలేకపోయాడు.
ఆంధ్ర పరాజయం విజయ్ హజారే ట్రోఫీ
ఆలూరు: జార్ఖండ్ తరఫున టాప్‌స్కోరర్‌గా నిలి చినా... ఎమ్మెస్ ధోని (64 బంతుల్లో 44; 4 ఫోర్లు) తన జట్టును గెలిపించలేకపోయాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో జార్ఖండ్‌ను చిత్తు చేసింది. ముందుగా జార్ఖండ్ 47 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. అనంతరం గుజరాత్ 40.5 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (2/30, 32 నాటౌట్) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాడు.
రాజ్‌కోట్: రవీంద్ర జడేజా (117 బంతుల్లో 134; 8 ఫోర్లు, 6 సిక్సర్లు)కు తోడు షెల్డన్ జాక్సన్ (111) కూడా సెంచరీ చేయడంతో సౌరాష్ట్ర 7 పరుగులతో మధ్యప్రదేశ్‌ను ఓడించింది. ముందుగా సౌరాష్ట్ర 5 వికెట్లకు 340 పరుగులు చేయగా, మధ్యప్రదేశ్ 49.1 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. జలజ్ సక్సేనా (133) శతకం వృథా అయింది.
న్యూఢిల్లీ: గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో బరోడా 89 పరుగులతో ఆంధ్రను చిత్తు చేసింది. కేదార్ దేవ్‌ధర్ (81), దీపక్ హుడా (53) రాణించడంతో బరోడా 6 వికెట్లకు 291 పరుగులు చేసింది. అనంతరం ఆంధ్ర 43.1 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌటైంది. కేవీ శశికాంత్ (59) అర్ధ సెంచరీ చేయగా, భరత్ (45), ఏజీ ప్రదీప్ (43) ఫర్వాలేదనిపించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ భార్గవ్ భట్ (6/37) ఆంధ్రను కుప్పకూల్చాడు.