
కొంప ముంచిన మెకల్లమ్ క్యాప్
రాజ్ కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10 లో భాగంగ గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ కు అదృష్టం కలిసి వచ్చింది. గుజరాత్ స్సిన్నర్ జడేజా వేసిన 8 ఓవర్లో దూకుడుగా ఆడిన గేల్ చివరి బంతిని గాల్లోకి లేపాడు. దీనిని మెకల్లమ్ బౌండరీ వద్ద అద్బుతంగా డైవ్ చేసి అందుకున్నాడు. కానీ అతని పెట్టుకున్న ఫ్లాపీ హ్యాట్ గేల్ ను రక్షించింది.థర్డ్ అంపైర్ రివ్యూలో క్యాప్ బౌండరీ కి తగలడంతో గేల్ నాటౌట్ గా ప్రకటించాడు. అదే సమయంలో అది సిక్సర్ అయ్యింది.
దీంతో క్యాప్ పెట్టుకోకున్నా గేల్ అవుటయ్యే వాడని లయన్స్ జట్టు సభ్యులు చింతించారు. గేల్ మాత్రం ఆ క్యాప్ కు ధన్యవాదాలు అన్నట్లు సైగ చేశాడు. ఇక జడేజా మాత్రం ఆ ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తరువాత ఇదే జోరును కొనసాగించిన గేల్ 23 బంతుల్లో 5 సిక్సర్లు, 3 ఫోర్లతో హాప్ సెంచరీ సాధించాడు.