'తిప్పి'కొట్టారు | India power ahead after NZ succumb to Jadeja and Ashwin | Sakshi
Sakshi News home page

'తిప్పి'కొట్టారు

Published Sun, Sep 25 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

'తిప్పి'కొట్టారు

'తిప్పి'కొట్టారు

జడేజా, అశ్విన్ విజృంభణ
తొలి ఇన్నింగ్‌‌సలో న్యూజిలాండ్ 262 ఆలౌట్
రెండో ఇన్నింగ్‌‌సలో భారత్ 159/1
విజయ్, పుజారా అజేయ అర్ధసెంచరీలు 

పిచ్ నుంచి కొంచెం సహకారం లభించినా ఎలా చెలరేగాలో అశ్విన్, రవీంద్ర జడేజాలకు తెలిసినంత ఎవరికీ తెలియదేమో! స్వదేశంలో ఏడాది కాలంగా స్పిన్ ట్రాక్‌లపై చెలరేగిపోతున్న ఈ ద్వయం కొత్త సీజన్‌నూ అంతే ఘనంగా ప్రారంభించింది. మూడో రోజు పిచ్‌పై లభించిన టర్న్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుని మ్యాచ్‌ను ‘తిప్పేసింది’. ఏడు పరుగుల వ్యవధిలో ఈ జోడీ ఏకంగా ఐదు వికెట్లు తీసి కివీస్‌ను కుప్పకూల్చింది. 255/5 స్కోరుతో పటిష్ట స్థితిలో కనిపించిన న్యూజిలాండ్ 262 పరుగులకే ఆలౌటై... ఆత్మరక్షణలో పడింది.

తొలి రెండు రోజులూ న్యూజిలాండ్ హవా నడిచిన కాన్పూర్ టెస్టులో మూడో రోజు ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం మారిపోరుుంది. అశ్విన్, జడేజా కలిసి తొమ్మిది వికెట్లు తీసి భారత్‌కు తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యం అందిస్తే... బ్యాటింగ్‌లో టాపార్డర్ మరోసారి రాణించింది. బంతి తిరుగుతున్న పిచ్‌పై స్పిన్నర్లకు లైన్ దొరకకుండా ఆడి పుజారా, విజయ్ మ్యాచ్‌ను భారత్ చేతుల్లోకి తెచ్చేశారు. ఈ ఇద్దరి అజేయ అర్ధసెంచరీలతో భారత్ ఇప్పటికే 215 పరుగుల ఓవరాల్ ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ ఇదే తరహాలో సాగితే... భారత్ విజయాన్ని ఆపడం న్యూజిలాండ్‌కు అసాధ్యమే. అరుుతే అది నాలుగో రోజేనా..? లేక విజయం ఐదో రోజు అందుతుందా..?

 కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ప్రత్యర్థి ఆధిపత్యానికి భారత స్పిన్నర్లు గండికొట్టారు. పిచ్ నుంచి అందివచ్చిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్పిన్నర్లు రవీంద్ర జడేజా (5/73), ఆర్.అశ్విన్ (4/93) కలిసి ఏకంగా తొమ్మిది వికెట్లు తీయడంతో కివీ రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడింది. దీంతో 152/1 స్కోరుతో పటిష్టంగా కనిపించిన జట్టు తమ తొలి ఇన్నింగ్‌‌సను 95.5 ఓవర్లలో 262 పరుగులకే ముగించాల్సి వచ్చింది.

విలియమ్సన్ (137 బంతుల్లో 75; 7 ఫోర్లు), లాథమ్ (151 బంతుల్లో 58; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా... రోంచి (83 బంతుల్లో 38; 6 ఫోర్లు), సాన్‌ట్నర్ (107 బంతుల్లో 32; 5 ఫోర్లు) కొద్ది సేపు క్రీజులో నిలవగలిగారు. అనంతరం తమ రెండో ఇన్నింగ్‌‌స ఆరంభించిన భారత్ శనివారం ఆట ముగిసే సమయానికి 47 ఓవర్లలో వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. క్రీజులో మురళీ విజయ్ (152 బంతుల్లో 64 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్), పుజారా (80 బంతుల్లో 50 బ్యాటింగ్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో  క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 107 పరుగులు జోడించారు. రాహుల్ (50 బంతుల్లో 38; 8 ఫోర్లు) వేగంగా ఆడాడు. ప్రస్తుతం భారత్ 215 పరుగుల ఆధిక్యంలో ఉండగా ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది.

 స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్‌‌స: 318

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్‌‌స: గప్టిల్ ఎల్బీడబ్ల్యు (బి) ఉమేశ్ యాదవ్ 21; లాథమ్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 58; విలియమ్సన్ (బి) అశ్విన్ 75; రాస్ టేలర్  ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 0; రోంచి ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 38; సాన్‌ట్నర్ (సి) సాహా (బి) అశ్విన్ 32; వాట్లింగ్ (సి అండ్ బి) అశ్విన్ 21; క్రెరుుగ్  ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 2; సోధి  ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 0; బౌల్ట్ (సి) రోహిత్ (బి) జడేజా 0; వాగ్నర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (95.5 ఓవర్లలో ఆలౌట్) 262.

వికెట్ల పతనం: 1-35, 2-159, 3-160, 4-170, 5-219, 6-255, 7-258, 8-258, 9-258, 10-262.
బౌలింగ్: షమీ 11-1-35-0; ఉమేశ్ యాదవ్ 15-5-33-1; జడేజా 34-7-73-5; అశ్విన్ 30.5-7-93-4; విజయ్ 4-0-10-0; రోహిత్ 1-0-5-0.

భారత్ రెండో ఇన్నింగ్‌‌స: రాహుల్ (సి) టేలర్ (బి) సోధి 38; విజయ్ బ్యాటింగ్ 64; పుజారా బ్యాటింగ్ 50; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (47 ఓవర్లలో వికెట్ నష్టానికి) 159.

వికెట్ల పతనం: 1-52.
బౌలింగ్: బౌల్ట్ 5-0-11-0; సాన్‌ట్నర్ 13-5-33-0; క్రెరుుగ్ 11-1-48-0; వాగ్నర్ 8-3-17-0; సోధి 7-2-29-1; గప్టిల్ 3-0-14-0.

తొలి సెషన్: ఆరంభంలోనే మూడు వికెట్లు
మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్‌కు ఆరంభంలోనే స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ షాక్ ఇచ్చారు. లాథమ్‌ను ఊరించే బంతితో అశ్విన్ ఎల్బీడబ్ల్యు చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం బరిలోకి దిగిన రాస్ టేలర్ తానెదుర్కొన్న రెండో బంతికే జడేజా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో రెండు ఓవర్ల అనంతరం నిలకడగా ఆడుతున్న విలియమ్సన్‌ను అశ్విన్ ఓ అద్భుత బంతితో అవుట్ చేశాడు. దీంతో 11 పరుగుల (24 బంతులు) వ్యవధిలోనే మూడు వికెట్లు నేలకూలడంతో కివీస్‌పై ఒత్తిడి పెరిగింది. బంతి కూడా ప్రమాదకరంగా టర్న్ అవుతుండడంతో సాన్‌ట్నర్, రోంచి ఆచితూచి ఆడారు. అరుుతే 80వ ఓవర్‌లో స్వీప్ షాట్ ఆడబోరుున రోంచి.. జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఐదో వికెట్‌కు వీరిద్దరూ 49 పరుగులు జత చేశారు. ఆ తర్వాత  వికెట్ పడకుండా కివీస్ తొలి సెషన్‌ను ముగించింది. ఓవర్లు: 38, పరుగులు: 87, వికెట్లు: 4

రెండో సెషన్: వణికించిన జడేజా
లంచ్ విరామనంతరం కివీస్ బ్యాట్స్‌మెన్‌ను జడేజా తన బంతులతో బెంబేలెత్తించాడు. మొదట అశ్విన్ తాను వేసిన తొలి బంతికే సాన్‌ట్నర్‌ను అవుట్ చేశాడు. బ్యాట్ ఎడ్‌‌జకు తాకిన బంతిని ఎడమ వైపు డైవ్ చేస్తూ కీపర్ సాహా సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ఆతర్వాత 95వ ఓవర్‌లో జడేజా కివీస్‌ను చావుదెబ్బ తీస్తూ ఏకంగా మూడు వికెట్లు తీయడంతో కోలుకోలేకపోరుుంది. వరుస బంతుల్లో క్రెరుుగ్ (2), సోధిలను ఎల్బీగా అవుట్ చేసి... హ్యాట్రిక్ మిస్ అరుునా చివరి బంతికి బౌల్ట్ చిక్కడంతో పాటు జడేజా ఐదు వికెట్లను పూర్తి చేశాడు. మరుసటి ఓవర్‌లోనే వాట్లింగ్ (54 బంతుల్లో 21; 4 ఫోర్లు)ను అశ్విన్ రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేయడంతో కివీస్ తొలి ఇన్నింగ్‌‌స ముగిసింది. కేవలం ఏడు పరుగుల వ్యవధిలోనే కివీస్ తమ చివరి ఐదు వికెట్లను కోల్పోరుుంది.

ఆ తర్వాత 56 పరుగుల తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యంతో తమ రెండో ఇన్నింగ్‌‌సను ఆరంభించిన భారత ఆటగాళ్లు కివీస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాహుల్ (50 బంతుల్లో 38; 8 ఫోర్లు) దూకుడు కనబరుస్తూ బౌండరీలతో చెలరేగాడు. 19వ ఓవర్ తొలి బంతికి తను స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడంతో జట్టు టీ విరామానికి వెళ్లింది.

ఓవర్లు: 10.5, పరుగులు: 24, వికెట్లు: 5 (కివీస్)
ఓవర్లు: 18.1, పరుగులు: 52, వికెట్లు 1 (భారత్)

మూడో సెషన్: పుజారా, విజయ్ అర్ధ సెంచరీలు
టీ విరామం అనంతరం బరిలోకి దిగిన పుజారాతో పాటు విజయ్ కూడా ఎదురుదాడికి దిగి బౌండరీల వర్షం కురిపించాడు. తాను ఎదుర్కొన్న తొలి ఓవర్‌లోనే పుజారా రెండు ఫోర్లు బాదగా ఆ తర్వాత ఓవర్‌లో విజయ్ రెండు, పుజారా మరో బౌండరీ సాధించారు. 22వ ఓవర్‌లో విజయ్ ఎల్బీ కోసం కివీస్ చేసిన భారీ అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించాడు. ఆ తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడిన విజయ్ ముందుగా 106 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే మూడో రోజు ఆట ముగియడానికి ముందు పుజారా కొట్టిన షాట్ పారుుంట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లాథమ్ తలకు గట్టిగా తాకింది. అరుుతే తను హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. అరుుతే పుజారా వెంటనే వెళ్లి అతడికి సారీ చెప్పాడు. ఇక ఆట చివరి ఓవర్‌లో పుజారా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఓవర్లు: 28.5, పరుగులు: 107, వికెట్లు: 0

2 ఓ ఇన్నింగ్‌‌సలో భారత బౌలర్లు ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ను ఎల్బీడబ్ల్యు చేయడం ఇది రెండోసారి.
3 మరో మూడు వికెట్లు తీస్తే టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలుస్తాడు.
5 ఇన్నింగ్‌‌సలో ఐదు వికెట్లకు పైగా తీయడం జడేజాకు ఇది ఐదోసారి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement