
కోహ్లీ గడ్డంపై అనుష్క వార్నింగ్
బెంగళూరు: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మలు ఈ మధ్య తమ ప్రేమయాణాన్ని సోషల్ మీడియా ఆధారంగా బాహాటంగా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోహ్లీ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ పోటోకు అనుష్క కామెంట్ చేసింది. ఐపీఎల్ సీజన్ లో న్యూలుక్ షేవింగ్ స్టైల్ తో కనబడుతున్న భారత క్రికెటర్ల ను అనుసరించనని కోహ్లీ చేసిన పోస్ట్ కు అనుష్క వార్నింగ్ కామెంట్ చేసింది.
తొలుత గుజరాత్ లయన్స్ ఆటగాడు రవీంద్ర జడేజా న్యూలుక్ షేవింగ్ తో ఈ ట్రెండ్ కు తెరలేపగా , ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు అనుసరించారు. ఈ స్టైల్ చూసిన కోహ్లీ కడుపుబ్బ నవ్వాడు. ఇలా జడేజా కొత్త స్టైల్ ను అనుసరిస్తూ ముంబై ఆటగాళ్లు హార్డిక్ పాండ్యా, రోహిత్ శర్మలు తమ న్యూ లుకింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లపై స్సందించిన కోహ్లీ గడ్డం పెంచుకున్న తన ఫోటోకు క్యాప్షన్ గా ' సారీ బాయ్స్ నేను నా గడ్డం తీయడానికి సిద్దంగా లేను. అలా మీరు గొప్ప పనిచేశారు' అని ఇన్ స్ట్రాగ్రమ్ లో పోస్ట్ చేశాడు. దీనికి అనుష్క' నీవల్ల కాదు' అని కామెంట్ చేసింది.