నా టాప్‌ ర్యాంకుకు వీరే కారణం: జడేజా | Jadeja Credits MS Dhoni & Virat Kohli for His Rise to the Top | Sakshi
Sakshi News home page

నా టాప్‌ ర్యాంకుకు వీరే కారణం: జడేజా

Published Wed, Aug 9 2017 2:54 PM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM

నా టాప్‌ ర్యాంకుకు వీరే కారణం: జడేజా

నా టాప్‌ ర్యాంకుకు వీరే కారణం: జడేజా

న్యూఢిల్లీ: ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టాప్‌ లేపిన భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజా తను ఈ ప్రతిభ సాధించడానికి భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలే కారణమని అభిప్రాయపడ్డాడు. గత కొంతకాలంగా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్న జడేజా..  తాజా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ర్యాంకింగ్స్ లో  ఆల్ రౌండర్ల విభాగంలో కూడా ప్రథమ స్థానం సాధించిన విషయం తెలిసిందే.
 
ఈ ప్రతిభ సాధించడానికి కోహ్లి, ధోనిలే కారణమని జడేజా ట్వీట్‌ చేశాడు. ‘ధోని, కోహ్లితో పాటు తన ఫోటోకు క్యాఫ్షన్‌గా నా ప్రయాణంలో టెస్టు ఆల్‌రౌండర్‌, బౌలింగ్‌ విభాగంలో తొలి స్థానం దక్కించుకోవడం  ధోని, కోహ్లి, నా అభిమానులు, బీసీసీఐ, టీమిండియా మద్దతు వల్లే సాధ్యమైందని’ పేర్కొన్నాడు.
 
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అజేయంగా 70 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు సాధించిన జడేజా తన రేటింగ్ పాయింట్లను మరింత మెరుగుపరుచుకుని ప్రథమ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం 438 రేటింగ్ పాయింట్లతో జడేజా టాప్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement