ధోని-జడేజా సెల్ఫీ వైరల్ | Ravindra Jadeja's selfie with MS Dhoni is going viral | Sakshi
Sakshi News home page

ధోని-జడేజా సెల్ఫీ వైరల్

Published Tue, Jun 6 2017 6:33 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

ధోని-జడేజా సెల్ఫీ వైరల్

ధోని-జడేజా సెల్ఫీ వైరల్

లండన్: భారత క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని-రవీంద్ర జడేజాల సెల్ఫీ ఒకటి ఇప్పుడు నెట్ లో చక్కర్లు కొడుతోంది.  ఇందుకు 'సర్' అని ధోని ముద్దుగా పిలుచుకునే జడేజానే కారణం. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా జట్టు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ధోని గుర్రు పెట్టి నిదురపోయాడు. ధోని ఆదమరిచి నిద్రిస్తున్న సమయాన్ని ఆసరాగా తీసుకున్న జడేజా సెల్ఫీ తీశాడు. దాన్ని జడేజా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశాడు. దానికి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అతను నిద్రనుంచి లేవడానికి ముందే ఆ దృశ్యాన్ని పిక్చర్ గా బంధిస్తా అని ఫోటో కింద ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం వైరల్ గా మారిన ఆ పోటోకు వేల సంఖ్యలు కామెంట్స్, వందల సంఖ్యలో లైక్స్ వచ్చాయి.


ప్రస్తుతం  చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ లో ఉన్న భారత్ జట్టు.. తన తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ జట్టు తన తదుపరి మ్యాచ్ లో శ్రీలంకతో తలపడనుంది. గురువారం లంకేయులతో జరిగే మ్యాచ్ లో భారత్ గెలిస్తే  సెమీస్ కు చేరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement