
భారత్ ఆటతీరుతో సంతృప్తి: ధోని
‘ఈ మ్యాచ్‌లో జడేజా, అశ్విన్ ఇద్దరితో పదేసి ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ చేయించాలని భావించా. ఐదుగురు బౌలర్లతో ఆడాలనేది కూడా మా వ్యూహం. అందుకే రైనాను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. మొత్తంగా మన బ్యాటింగ్, బౌలింగ్ సంతృప్తినిచ్చాయి. నాకు వార్మప్ మ్యాచ్‌లపై సదభిప్రాయం లేదు. కాబట్టి నా బ్యాటింగ్ గురించి ఆందోళన అనవసరం. పాక్‌తో మ్యాచ్‌లో అప్పటి పరిస్థితులు, పిచ్‌ను బట్టే ఏ బౌలర్లను ఎంచుకోవాలో నిర్ణయిస్తాం.’