జడేజా విజృంభణ
చెన్నై: ఇంగ్లండ్ తో చివరి టెస్టు ఆఖరి రోజు ఆటలో భారత స్సిన్నర్ రవీంద్ర జడేజా దూకుడు కొనసాగిస్తున్నాడు. జడేజా ఐదు వికెట్లు సాధించి ఇంగ్లండ్ టాపార్డర్ను కకావికలం చేశాడు. అలెస్టర్ కుక్ (49), జెన్నింగ్స్(54),రూట్(6), మొయిన్ అలీ(44), స్టోక్స్(23) లను అవుట్ చేశాడు. దాంతో టీ విరామం తరువాత ఇంగ్లండ్ 192 పరుగుల వద్ద ఆరో వికెట్ను నష్టపోయింది. మొయిన్ అలీని ఐదో వికెట్ గా జడేజా అవుట్ చేయగా ఆ తరువాత కొంత సేపటికి స్టోక్స్ ను అవుట్ చేశాడు.
అంతకుముందు బెయిర్ స్టో(1)ను ఇషాంత్ శర్మ పెవిలియన్ కు పంపాడు. ఇంకా సుమారు 20.0 ఓవర్లు పాటు ఆట మిగిలి ఉండటంతో భారత్ విజయంపై ఆశలు పెట్టుకోగా, ఇంగ్లండ్ మాత్రం డ్రా కోసం పోరాడుతోంది. మరో నాలుగు వికెట్లను తీస్తే భారత్ ఖాతాలో సంచలన విజయం చేరుతుంది.12/0 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ తొలి సెషన్ లో అత్యంత నిలకడగా ఆడింది. ఆ తరువాత రెండో సెషన్ లో నాలుగు కీలక వికెట్లను చేజార్చుకోగా, మూడో సెషన్ ఆదిలోనే రెండు వికెట్లను నష్టపోయింది. ఆ తరువాత ఏడో వికెట్ ను మిశ్రా తీయగా, ఎనిమిదో వికెట్ ను ఉమేష్ యాదవ్ తీశాడు. ఏడో వికెట్ గా డాసన్(0) అవుట్ కాగా, ఎనిమిదో వికెట్ గా రషిద్(2) పెవిలియన్ చేరాడు.