
జడేజా టాప్ ర్యాంక్ పదిలం
దుబాయ్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సోమవారం వెల్లడించిన ఈ జాబితాలో జడేజా 898 పాయింట్లతో నంబర్‌వన్‌గా ఉన్నా డు. అశ్విన్ (865) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరు మినహా మిగతా భారత బౌలర్లెవరూ టాప్–10లో లేరు.