అశ్విన్, జడేజాలకు రెస్ట్ | ashwin, jadeja rested for twenty 20 series, mishra,parvez rasool will replace in the due | Sakshi
Sakshi News home page

అశ్విన్, జడేజాలకు రెస్ట్

Published Mon, Jan 23 2017 2:07 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

అశ్విన్, జడేజాలకు రెస్ట్

అశ్విన్, జడేజాలకు రెస్ట్

ముంబై:మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్తో జరిగే మూడు ట్వంటీ 20ల సిరీస్కు భారత ఆల్ రౌండర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి నిచ్చారు. ఇప్పటికే ఇంగ్లండ్ తో భారత్ సుదీర్ఘ సిరీస్ ఆడిన నేపథ్యంలో ఈ ఇద్దరూ స్టార్ స్పిన్నర్లకు విశ్రాంతినిస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వీరి స్థానంలో మరో ఇద్దరు స్పిన్నర్లు అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్లకు చోటు కల్పించారు.ఈ మేరకు సోమవారం జరిగిన సెలక్షన్ లో మిశ్రా, రసూల్ లు స్థానం దక్కించుకున్నారు.

 

ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు మిశ్రాను ఎంపిక చేసినా, అతనికి ఒక టెస్టు మ్యాచ్ లో మాత్రమే ఆడాడు. ఆ తరువాత అతనికి ఇంగ్లండ్ తో మిగతా టెస్టు సిరీస్లో, వన్డే సిరీస్లో ఆడే అవకాశం దక్కలేదు. ఇక ఇంగ్లండ్ తో ట్వంటీ 20 సిరీస్ మిగిలి ఉండటంతో ఈ వెటరన్ను మరోసారి పరీక్షించదలచిన సెలక్టర్లు ఆ మేరకు అతనికి స్థానం కల్పించారు.

మరొకవైపు జమ్మూ కశ్మీర్కు చెందిన పర్వేజ్ రసూల్కు తదుపరి టీ 20 సిరీస్లో ఎంపిక చేశారు. ఇప్పటివరకూ ఒక వన్డే మాత్రమే ఆడిన ఆల్ రౌండర్ రసూల్ కు మరొకసారి అవకాశం ఇచ్చేందుకు మొగ్గు చూపారు. 2014, జూన్ లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా రసూల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పుడు రెండు వికెట్లతో రసూల్ ఫర్వాలేదనిపించాడు. జనవరి 26వ తేదీ నుంచి ఇంగ్లండ్-భారత జట్ల మధ్య మూడు ట్వంటీ 20 సిరీస్ ఆరంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement