misra
-
లఖీంపూర్ కేసు: కేంద్ర మంత్రి కుమారుడిపై అభియోగాలు
లఖీంపూర్ ఖేరి: నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది మృతికి కారణమైన లఖీంపూర్ ఖేరి సంఘటనలో నిందితులపై కోర్టులో విచారణకు రంగం సిద్ధమయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాతోపాటు మరో 12 మంది నిందితులపై జిల్లా కోర్టు అభియోగాలు నమోదు చేసింది. హత్య, నేరపూరిత కుట్ర, సంబంధిత సెక్షన్ల కింద అభియాగాలు మోపింది. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 147, 148(అల్లర్లు), 149(చట్టవిరుద్ధంగా గుమికూడడం), 302(హత్య), 307(హత్యాయత్నం), 326(ఆయుధాలతో గాయపర్చడం), 427, 120బీతోపాటు మోటార్ వాహన చట్టంలోని 177 కింద అదనపు జిల్లా జడ్జి సునీల్‌కుమార్ వర్మ అభియోగాలు నమోదు చేశారు. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. 13 మంది నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారు. బెయిల్‌పై బయట ఉన్న 14వ నిందితుడు వీరేంద్ర శుక్లాపై ఐపీసీ సెక్షన్ 201 అభియోగాలు నమోదయ్యాయి. ఆశిష్ మిశ్రాతోపాటు కొందరు నిందితులపై ఆయుధాల చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. 2021 అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరిలో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులపైకి వాహనం దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం రైతుల దాడిలో ఒక డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక జర్నలిస్టు మరణించారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనంలో ఆశిష్ మిశ్రా ఉన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: మళ్లీ సరిహద్దు రగడ -
ఉపాధి పనుల్లో అవకతవకలకు పాల్పడొద్దు
కలెక్టర్ కార్తికేయ మిశ్రా కాట్రావులపల్లిలో పంట కాల్వ పనులు పరిశీలన గ్రామంలో హైస్కూల్ తనిఖీ హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారుడి ఇంటి నిర్మాణానికి భూమి పూజ జగ్గంపేట : ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా హెచ్చరించారు. జిల్లాలో కాకినాడ రూరల్ నుంచి పిఠాపురం, గొల్లప్రోలు, శంకవరం, ప్రత్తిపాడు, జగ్గంపేట తదితర మండలాలలో గురువారం ఉదయం నుంచి ప్రభుత్వ పథకాల తీరుని పరిశీలించేందుకు సుడిగాలి పర్యటన చేసిన ఆయన మండలంలోని కాట్రావులపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామ పరిధిలో పెద్దాపురం రోడ్డును ఆనుకుని పంట కాల్వ పూడిక తీత పనులను కలెక్టర్ పరిశీలించారు. ఉపాధి పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని సిబ్బందికి సూచించారు. ఏపీఓ ఇచ్చిన నివేదిక చూసి పనులు శాతం ఇతర మండలాల కన్నా తక్కువగా ఉందని ఎక్కువ పనులు కల్పించి కూలి ఎక్కువ వచ్చేలా చూడాలన్నారు. అనంతరం సమీపంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజనంపై విద్యార్థులను ప్రశ్నించగా కొద్ది మంది మాత్రమే తిన్నట్టు తెలిపారు. హెచ్ఎం చౌదరి స్పందించి వేసవి సెలవులు తరువాత సోమవారం నుంచి బడులు తీయడంతో హాజరు తక్కువగా ఉన్నందున 20 మందికి భోజనం పెట్టామన్నారు. ఉపాధ్యాయుల ఖాళీల గురించి ప్రశ్నించగా 24 మంది ఉన్నారని, డ్రాయింగ్ టీచర్ పోస్టు ఖాళీగా ఉందన్నారు. 300 మంది విద్యార్థులు ఉన్నారని హెచ్ఎం తెలిపారు. విద్యాబోధన, గేమ్స్, విద్యార్థులకు వస్తున్న మార్కులు తదితర వాటి గురించి ఉపాధ్యాయులను కలెక్టర్ ఆరా తీశారు. అక్కడ నుంచి గ్రామంలోని ఎస్సీపేట చేరుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నేతిపూడి చంటి గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నేతిపూడి వెంకటరమణ ఇంటిని ప్రారంభించారు. హౌసింగ్ పీడీ ప్రసాద్, డీఈఈ వేణుగోపాలరావులను లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఒక బాలుడిని ఆపి చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ విశ్వేశ్వరరావు, డ్వామా పీడీ రాజకుమారి, ఎంపీడీఓ వాసుదేవరావు, ఏపీఓ రాజబాబు, తదితరులు పాల్గొన్నారు. -
కొత్త కలెక్టర్‌గా కార్తికేయ మిశ్రా
- అరుణ్‌కుమార్ బదిలీ - కర్నూలు కలెక్టర్‌గా జేసీకి పదోన్నతి సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌ను ప్రభుత్వం సోమవారం రాత్రి బదిలీ చేసింది. ఆయన స్థానంలో జిల్లా నూతన కలెక్టర్‌గా కార్తికేయ మిశ్రా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన ఏ క్షణాన్నైనా వెలువడే అవకాశం ఉంది. పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా పని చేసిన కార్తికేయ మిశ్రా 2009 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. రాష్ట్రంలో పెద్దదైన తూర్పు గోదావరి జిల్లాకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లుగా డైరెక్ట్ ఐఏఎస్‌లను నియమించాలనే సీఎం చంద్రబాబు ఆలోచనల్లో భాగంగానే ఈ నియామకం జరిగింది. కాగా, బదిలీ అయిన కలెక్టర్ అరుణ్‌కుమార్ సెర్‌్ప సీఈఓగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణను పదోన్నతిపై కర్నూలు కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ విషయాన్ని ఆయన సోమవారం రాత్రి ‘సాక్షి’కి ధ్రువీకరించారు. బదిలీ అయిన కలెక్టర్, జేసీలు ఇద్దరూ కన్ఫర్డ్ ఐఏఎస్‌లు. వీరిద్దరూ జిల్లాకు వచ్చి సుమారు రెండేళ్లు పూర్తవుతోంది. వారిద్దరినీ ప్రభుత్వం ఒకేసారి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. జిల్లా జేసీగా ఎవరిని నియమిస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. -
అశ్విన్, జడేజాలకు రెస్ట్
ముంబై:మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్‌తో జరిగే మూడు ట్వంటీ 20ల సిరీస్‌కు భారత ఆల్ రౌండర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి నిచ్చారు. ఇప్పటికే ఇంగ్లండ్ తో భారత్ సుదీర్ఘ సిరీస్ ఆడిన నేపథ్యంలో ఈ ఇద్దరూ స్టార్ స్పిన్నర్లకు విశ్రాంతినిస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వీరి స్థానంలో మరో ఇద్దరు స్పిన్నర్లు అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్‌లకు చోటు కల్పించారు.ఈ మేరకు సోమవారం జరిగిన సెలక్షన్ లో మిశ్రా, రసూల్ లు స్థానం దక్కించుకున్నారు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు మిశ్రాను ఎంపిక చేసినా, అతనికి ఒక టెస్టు మ్యాచ్ లో మాత్రమే ఆడాడు. ఆ తరువాత అతనికి ఇంగ్లండ్ తో మిగతా టెస్టు సిరీస్‌లో, వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం దక్కలేదు. ఇక ఇంగ్లండ్ తో ట్వంటీ 20 సిరీస్ మిగిలి ఉండటంతో ఈ వెటరన్‌ను మరోసారి పరీక్షించదలచిన సెలక్టర్లు ఆ మేరకు అతనికి స్థానం కల్పించారు. మరొకవైపు జమ్మూ కశ్మీర్‌కు చెందిన పర్వేజ్ రసూల్‌కు తదుపరి టీ 20 సిరీస్‌లో ఎంపిక చేశారు. ఇప్పటివరకూ ఒక వన్డే మాత్రమే ఆడిన ఆల్ రౌండర్ రసూల్ కు మరొకసారి అవకాశం ఇచ్చేందుకు మొగ్గు చూపారు. 2014, జూన్ లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా రసూల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పుడు రెండు వికెట్లతో రసూల్ ఫర్వాలేదనిపించాడు. జనవరి 26వ తేదీ నుంచి ఇంగ్లండ్-భారత జట్ల మధ్య మూడు ట్వంటీ 20 సిరీస్ ఆరంభం కానుంది.