twenty 20 series
-
అప్డేట్స్: ఐదో వికెట్ కోల్పోయిన భారత్
సాక్షి, కోల్‌కతా: టెస్టు సిరీస్‌ను ఏకపక్షంగా గెల్చుకుని, వన్డే సిరీస్‌ను ఒడిసిపట్టిన టీమిండియా.. టీ20 సిరీస్‌లోనూ వెస్టిండీస్‌తో అమీ-తుమీకి భారత్ సిద్ధమైంది. ఈ మేరకు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారమిక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో రెండు జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఫీల్డింగ్ ఎంచుకున్నారు. తమ ఆటతీరుకు సరితూగే పొట్టి ఫార్మాట్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన విండీస్ జట్టుకు ఈ సిరీస్ అత్యంత కఠినమైనదే. పైగా ఈసారి దాదాపు చాలామంది కొత్తవారితో ఆడుతోంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు భారత్‌కు 110 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్ అప్డేట్స్ ఇవి.. 24 బంతుల్లో 19 పరుగులు మనీశ్ పాండే, పియరీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. 13 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4వికెట్లు కోల్పోయి 73పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో దినేశ్ కార్తీక్(22), మనీశ్ పాండే(12) లు ఉన్నారు. భారత్ విజయానికి 42 బంతుల్లో 37 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ విజయం సాధించాలంటే 72 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉంది. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డ భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. నిలకడగా ఆడుతున్న కేఎల్ రాహుల్(16) కూడా బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో జౌటయ్యాడు. 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. రోహిత్, ధావన్‌ల వికెట్లు కోల్పోయిన భారత్‌కు మరో షాక్ తగిలింది. బ్రాత్ వైట్ బౌలింగ్‌లో పంత్(1) ఔటయ్యాడు. లక్ష్య చేధనలో భారత్ తడబాటుకు గురవుతోంది. తొలి ఓవర్లోనే రోహిత్ వికెట్ కోల్పోయిన భారత్, మూడో ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. థామస్ బౌలింగ్‌లో 3 పరుగులు చేసిన ధావన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. 110 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. 6 బంతుల్లో 6 పరుగులు చేసిన రోహిత్, ఒషేన్ థామస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. విండీస్ భారత్‌కు 110 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్, బుమ్రా, కృనాల్ పాండ్యాలకు ఒక్కో వికెట్ దక్కింది. చివరి రెండు ఓవర్లలో విండీస్ ఆటగాళ్లు ధాటిగా ఆడటంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో విండీస్ 22 పరుగులు చేసింది. ధాటిగా ఆడుతున్న విండీస్ ఆటగాడు ఫాబియన్ అలెన్(20 బంతుల్లో 27 పరుగులు) ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి విండీస్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. ఇప్పటికే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ విండీస్ మరో వికెటు కోల్పోయింది. 11 బంతుల్లో 4 పరుగులు చేసిన బ్రాత్వైటు కుల్దీప్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మొత్తంగా 4 ఓవర్లలో 13 పరుగులిచ్చిన కుల్దీప్ 3 వికెట్లు తీశాడు. 15 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 7వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. డారెన్ బ్రావోను పెవిలియన్‌కు పంపిన కుల్దీప్ యాదవ్‌కు.. మరో వికెట్ లభించింది. కుల్దీప్ వేసిన 13 ఓవర్లో 3 బంతికి రావ్మన్ పావెల్(4) ఔటయ్యాడు. దీంతో విండీస్ 13 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ వెంటవెంటనే వికెట్లు కొల్పోతుంది. 10 ఓవర్లో కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో కీరన్ పోలార్డ్(14) పరుగులకు ఔటవ్వగా, ఆ తర్వాతి ఓవర్లో 10 బంతుల్లో 5 పరుగులు చేసిన డారెన్ బ్రావో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం విండీస్ 10.2 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. ఆదిలోనే తడబాటుకు గురయిన విండీస్‌కు మరో షాక్ తగిలింది. 7 బంతుల్లో 10 పరుగులు చేసిన హెట్‌మైర్ బుమ్రా బౌలింగ్‌లో జౌటవ్వడంతో.. విండీస్ కష్టాల్లో పడింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి విండీస్ మూడు వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. ప్రస్తుతం కీరన్ పోలార్డ్(4), డారెన్ బ్రావో(0) క్రీజులో ఉన్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు ఆదిలోనే తడబడింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఓపెనర్ డీ రామ్‌దిన్ 2 పరుగులకు ఔటవ్వగా.. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన మరో ఓపెనర్ ఎస్డీ హోప్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. దీంతో ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన విండీస్ ఆదిలోనే తడబాటుకు గురైంది. ఎస్డీ హోప్ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. మొత్తానికి 4.1 ఓవర్లలో వెస్టిండీస్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది. గాయం కారణంగా హార్ధిక్ పాండ్యా మ్యాచ్‌కు దూరం కావడంతో అతని సోదరుడు కృనాల్‌కు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్ ద్వారా కృనాల్ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్ వెస్టీండిస్: రావ్మన్ పావెల్, డారెన్ బ్రావో, హోప్, హెట్‌మైర్, రామ్‌దిన్, కీరన్ పోలార్డ్, కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), కీమో పాల్, కారీ పియరీ, ఫాబియన్ అలెన్, ఒషేన్ థామస్ -
టీమిండియా ఆధిక్యం కొనసాగేనా?
రాంచీ:ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. అదే ఊపును ట్వంటీ 20 సిరీస్ లో కూడా కొనసాగించడానికి సిద్ధమైంది. ఒకవైపు విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత్ జట్టుకు మరింత ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో తొలి టీ 20 సన్నద్దమవుతుండగా, కనీసం తమ అదృష్టం ఇక్కడైన మారుతుందనే ఆశతో ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ శనివారం రాత్రి గం.7.00 ని.లకు జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనుంది. ఆసీస్ తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను భారత్ 4-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక్క నాల్గో వన్డేలో మినహా మిగతా వన్డేల్లో భారత్ ఘన విజయాల్ని నమోదు చేసి సిరీస్ ను చేజిక్కించుకుంది. ఈ క్రమంలో విరాట్ సేన రెట్టించిన ఉత్సాహంతో పొట్టి సిరీస్ కు సన్నద్ధమైంది. దీనిలో భాగంగా తొలి ట్వంటీ 20లోనే విజయం సాధించి ఆసీస్ ను ఆందోళనలో నెట్టేందుకు విరాట్ అండ్ గ్యాంగ్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ట్వంటీ 20ల్లో కూడా ఆసీస్ కంటే భారతే బలంగా ఉన్న నేపథ్యంలో తొలి అడుగును ఘనంగా ఆరంభించాలని భావిస్తోంది. చిన్నచిన్న మార్పులతోనే భారత్ టీ 20 పోరుకు సిద్ధమం కావడంతో పాటు కొన్ని ప్రయోగాల్ని చేస్తూ ముందుకు సాగుతుండటం ఇది మరొక ప్రయోగాల సిరీస్ గా చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకూ ఆటగాళ్లను పదే పదే మార్చి వారి ప్రతిభను అన్ని కోణాల్లో విశ్లేషించడానికి ఈ సిరీస్ ను వేదికగా చేసుకునేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంచితే, ఇప్పటివరకూ రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఒక ట్వంటీ 20 మ్యాచ్ మాత్రమే జరిగింది. గతేడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో ఇక్కడ ట్వంటీ 20 జరగ్గా అందులో భారత్ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. ట్వంటీ 20లో యావరేజ్ స్కోరు, అత్యధిక స్కోరు 196 కాగా, అత్యల్ప స్కోరు 127. మరొకవైపు ఇక్కడ జరిగిన నాలుగు వన్డేల్లో భారత్ రెండింట విజయం సాధించగా, ఒక దాంట్లో ఓటమి పాలైంది. మరొక మ్యాచ్ లో ఫలితం రాలేదు. వాతావరణం.. ఆకాశం మేఘావృతం అయినప్పటికీ మ్యాచ్ కు ఆటకం కల్గించకపోవచ్చు. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్టం 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది. కాకపోతే చల్లటి గాలులు వీచే అవకాశాలున్నాయి. తుది జట్లు అంచనా: భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్),రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, బూమ్రా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఆశిష్ నెహ్రా ఆస్ట్రేలియా:స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్ వెల్, డాన్ క్రిస్టియన్, నాథన్ కౌల్టర్ నైల్, కమిన్స్ ,హెన్రిక్యూస్, కేన్ రిచర్డ్ సన్, ఆడమ్ జంపా -
ఉత్కంఠ పోరులో పాక్ గెలుపు
ట్రినిడాడ్: నాలుగు ట్వంటీ 20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ తో ఇక్కడ హోరాహోరీగా జరిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ మూడు పరుగుల తేడాతో గెలిచింది. వెస్టిండీస్ ను 129 పరుగులకే కట్టడి చేసి స్వల్ప తేడాలో విజయాన్ని అందుకుంది. పాక్ విజయంలో లెగ్ స్పిన్నర్ షాదబ్ ఖాన్ నాలుగు వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో 132 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన వెస్టిండీస్ చివరి వరకూ పోరాటం సాగించినా ఓటమి తప్పలేదు. విండీస్ జట్టులో శ్యామ్యూల్స్(44), వాల్టాన్(21), జాసన్ హోల్డర్(26 నాటౌట్)లు ఫర్వాలేదనిపించినా ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు.ప్రధానంగా చివరి ఓవర్లో విండీస్ విజయానికి 13 పరుగులు కావాల్సిన తరుణంలో సునీల్ నరైన్ బ్యాట్ ఝుళిపించాడు. వరుసగా రెండు బంతులను ఫోర్లగా మలిచి విజయంపై ఆశలు పెంచాడు. అయితే సింగిల్ తీసే ప్రయత్నంలో నరైన రనౌట్ గా పెవిలియన్ కు చేరడంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసి ఓటమి పాలైంది. దాంతో రెండో ట్వంటీ 20లోనూ విండీస్ పరాజయం పాలై సిరీస్ లో వెనుకబడింది. -
ఆసీస్ టీ 20 కెప్టెన్‌గా ఫించ్
సిడ్నీ:త్వరలో శ్రీలంకతో జరిగే ట్వంటీ 20 సిరీస్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా అరోన్ ఫించ్‌ను ఎంపిక చేశారు.ఈ సిరీస్‌కు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు అందుబాటులో ఉండకపోవడంతో ఫించ్‌ను సారథిగా నియమిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల్లో భారత్ తో టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో ఆసీస్ ప్రధాన ఆటగాళ్లు స్వదేశంలో జరిగే ట్వంటీ 20 సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. ప్రధానంగా కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లతో పాటు మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జోష్ హజల్‌వుడ్, ఉస్మాన్ ఖజాలు భారత్ తో సిరీస్‌లో పాల్గొనున్నారు. అదే సమయంలో స్వదేశంలో ఆసీస్‌కు ట్వంటీ 20 సిరీస్ ఉండటంతో ఆటగాళ్లను ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే శ్రీలంకతో సిరీస్‌కు ఫించ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. -
11 సిక్సర్లు, 9 ఫోర్లతో చెలరేగినా..
ఆక్లాండ్:చాపెల్-హ్యాడ్లీ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా పోరాడి ఓడింది. న్యూజిలాండ్ విసిరిన 286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆసీస్ 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయినప్పటికీ మార్కస్ స్టోయినిస్(146 నాటౌట్;117 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లు) ఒంటిరి పోరాటం చేశాడు. తన కెరీర్లో రెండో వన్డే ఆడుతున్న స్టోయినిస్ చెలరేగి ఆడాడు. బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడ్డాడు. అయినప్పటికీ జట్టును విజయ తీరాలకు మాత్రం చేర్చలేకపోయాడు. అతనికి సరైన సహకారం లేకపోవడంతో ఆసీస్ ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగానే వికెట్లను కోల్పోయి పరాజయం చెందింది. ఆసీస్ ఇన్నింగ్స్ 47.0 ఓవర్ చివరి బంతికి హజల్ వుడ్ రనౌట్ కావడంతో ఆసీస్ కు ఓటమి తప్పలేదు. దాంతో స్టోయినిస్ శ్రమ వృథా ప్రయాసగానే మిగిలింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50.0 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.గప్టిల్ (61), బ్రూమ్(73), నీషమ్(48), విలియమ్సన్(24)లు ఆకట్టుకోవడంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరును ఆసీస్ ముందుంచింది. ఈ మ్యాచ్ లో విజయంతో న్యూజిలాండ్ 1-0 తో ఆధిక్యం సాధించింది. -
అదే మా ప్రణాళిక: విరాట్ కోహ్లి
-
అదే మా ప్రణాళిక: విరాట్ కోహ్లి
కాన్పూర్:ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్‌ను, వన్డే సిరీస్‌ను గెలిచిన విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియాకు ట్వంటీ 20 సిరీస్ ఆదిలోనే చుక్కెదురైంది. మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా గురువారం ఇంగ్లండ్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. టీమిండియా బ్యాటింగ్ సమతుల్యంగా లేకపోవడంతోనే ఓటమి ఎదురైందనే వాదన వినిపిస్తోంది. ప్రధానంగా ఓపెనర్‌గా విరాట్ కోహ్లి బ్యాటింగ్ కు రావడంపై చర్చ జరిగింది. గతంలో అంతర్జాతీయ టీ 20 ఫార్మాట్ లో ఒకసారి మాత్రమే వచ్చిన విరాట్.. దాదాపు నాలుగేళ్ల తరువాత మళ్లీ ఓపెనర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 29 పరుగులు చేసి కాస్త ఫర్వాలేదనిపించినా, అతని స్థాయి బ్యాటింగ్‌కు అందుకోలేకపోయాడు. కాగా, తాను ఓపెనర్‌గా రావడాన్ని కోహ్లి సమర్ధించుకున్నాడు. 'నేను ఓపెనర్‌గా రావడంలో ప్రత్యేకత ఏమీ లేదు. నా ఓపెనింగ్‌తో జట్టుకు వచ్చిన ఇబ్బందికూడా ఏమీ లేదు. ప్రతీఒక్కరికీ ఒక్కో రకమైన అంచనా ఉంటుంది. ఆ క్రమంలోనే నేను ఓపెనింగ్ కు వచ్చా. గత ఐపీఎల్ సీజన్లో నేను ఓపెనర్‌గా వచ్చి సక్సెస్ అయ్యా. దాన్ని దృష్టిలో్ పెట్టుకునే నేను ఓపెనింగ్‌కు వచ్చా. అది జట్టు ప్రణాళికలో ఒక భాగం. ఓపెనర్‌గా రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతోనే నేను ఆ బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది. మిడిల్ ఆర్డర్లో సురేశ్ రైనా లాంటి ఆటగాడితో జట్టు సమతుల్యంగా ఉంది. నాకు స్థానాలతో పట్టింపులేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఓపెనర్‌గా దిగితేనే జట్టు పటిష్టంగా ఉంటుంది. ఆ కారణం చేతే నేను ఓపెనర్‌గా దిగాల్సి వచ్చింది. గతంలో నేను ఓపెనర్‌గా విఫలమై ఉంటే నన్ను తప్పుపట్టవచ్చు. ఐపీఎల్ తో పాటు, అంతకుముందు నేను ఓపెనర్‌గా వచ్చిన ట్వంటీ 20లోనూ రాణించా. అటువంటప్పుడు నా ఓపెనింగ్‌ను తప్పుపట్టాల్సిన అవసరం లేదు' అని కోహ్లి తెలిపాడు. -
అశ్విన్, జడేజాలకు రెస్ట్
ముంబై:మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్‌తో జరిగే మూడు ట్వంటీ 20ల సిరీస్‌కు భారత ఆల్ రౌండర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతి నిచ్చారు. ఇప్పటికే ఇంగ్లండ్ తో భారత్ సుదీర్ఘ సిరీస్ ఆడిన నేపథ్యంలో ఈ ఇద్దరూ స్టార్ స్పిన్నర్లకు విశ్రాంతినిస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వీరి స్థానంలో మరో ఇద్దరు స్పిన్నర్లు అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్‌లకు చోటు కల్పించారు.ఈ మేరకు సోమవారం జరిగిన సెలక్షన్ లో మిశ్రా, రసూల్ లు స్థానం దక్కించుకున్నారు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు మిశ్రాను ఎంపిక చేసినా, అతనికి ఒక టెస్టు మ్యాచ్ లో మాత్రమే ఆడాడు. ఆ తరువాత అతనికి ఇంగ్లండ్ తో మిగతా టెస్టు సిరీస్‌లో, వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం దక్కలేదు. ఇక ఇంగ్లండ్ తో ట్వంటీ 20 సిరీస్ మిగిలి ఉండటంతో ఈ వెటరన్‌ను మరోసారి పరీక్షించదలచిన సెలక్టర్లు ఆ మేరకు అతనికి స్థానం కల్పించారు. మరొకవైపు జమ్మూ కశ్మీర్‌కు చెందిన పర్వేజ్ రసూల్‌కు తదుపరి టీ 20 సిరీస్‌లో ఎంపిక చేశారు. ఇప్పటివరకూ ఒక వన్డే మాత్రమే ఆడిన ఆల్ రౌండర్ రసూల్ కు మరొకసారి అవకాశం ఇచ్చేందుకు మొగ్గు చూపారు. 2014, జూన్ లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా రసూల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పుడు రెండు వికెట్లతో రసూల్ ఫర్వాలేదనిపించాడు. జనవరి 26వ తేదీ నుంచి ఇంగ్లండ్-భారత జట్ల మధ్య మూడు ట్వంటీ 20 సిరీస్ ఆరంభం కానుంది. -
చెలరేగిన అండర్సన్
మౌంట్ మాన్గాని:బంగ్లాదేశ్ తో జరిగిన చివరిదైన మూడో ట్వంటీ 20 న్యూజిలాండ్ ఆటగాడు కోరీ అండర్సన్ చెలరేగిపోయాడు. 41 బంతుల్లో 10 సిక్సర్లు, 2 ఫోర్లతో 94 పరుగులు నమోదు చేసి అజేయంగా నిలిచాడు. తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 27 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. అంతకుముందు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(60) బాధ్యతాయుతంగా ఆడటంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ 20.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి ఓటమి పాలైంది. బంగ్లా ఆటగాళ్లలో తమిమ్ ఇక్బాల్(24) మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, సౌమ్య సర్కార్(42), షకిబుల్ హసన్(41)లు రాణించారు. అయితే లక్ష్యం ఎక్కువగా ఉండటంతో బంగ్లాదేశ్ కు పరాజయం తప్పలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో బోల్ట్, సౌథీలకు తలో రెండు వికెట్లు లభించగా,సాంట్నార్, విలియమ్సన్లకు చెరో వికెట్ దక్కింది. -
కివీస్ 'సెంచరీల' రికార్డు!
మౌంట్ మాన్గాని:న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సరికొత్త రికార్డు నమోదు చేసింది. శుక్రవారం ఇక్కడ బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో ట్వంటీ 20 లో కివీస్ ఆటగాడు కొలిన్ మున్రో(101) శతకం సాధించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా ట్వంటీ 20 చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఈ తాజా సెంచరీతో న్యూజిలాండ్ ట్వంటీ 20ల్లో నాలుగు శతకాలను నమోదు చేసింది. అంతకుముందు మూడేసి సెంచరీలు మాత్రమే పలు జట్లు నమోదు చేశాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, భారత్ జట్లు మూడేసి సెంచరీలు చొప్పున సాధించగా, దాన్ని కివీస్ అధిగమించింది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో మెకల్లమ్ రెండు ట్వంటీ 20 సెంచరీలు చేయగా, గప్టిల్, మున్రోలు తలో సెంచరీ చేశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచి సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 18.1 ఓవర్లలో148 పరుగులకే ఆలౌటై 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ సిరీస్‌ను కోల్పోయింది. -
పాక్‌దే టీ 20 సిరీస్
దుబాయ్: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ 20 సిరీస్‌ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో పాక్ 16 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-0 తో చేజిక్కించుకుంది. అంతకుముందు తొలి టీ 20లో పాక్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో టీ 20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. పాక్ ఆటగాళ్లలో ఓపెనర్ ఖలీద్ లతీఫ్(40), కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(46 నాటౌట్), షోయబ్ మాలిక్(37)లు రాణించి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. అనంతర బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్ 20.0 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. వెస్టిండీస్ ఆటగాళ్లలో సునీల్ నరైన్(30), ఆండ్రూ ఫ్లెచర్(29) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో ఓటమి పాలైంది. -
మరో సిరీస్ లక్ష్యంగా...
నేడు జింబాబ్వేతో భారత్ చివరి టి20 డీడీ నేషనల్లో సాయంత్రం 4.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం తొలి టి20 ఓటమి నుంచి తొందరగానే కోలుకుని దెబ్బతిన్న పులిలా రెండో టి20లో చెలరేగిన భారత్ జట్టు... మరో సిరీస్ లక్ష్యంగా ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. జింబాబ్వేపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ధోనిసేన విజయంతో పర్యటనను ముగించాలని భావిస్తోంది. హరారే: అంతర్జాతీయ వేదికపై తమ సత్తాను నిరూపించుకోవడానికి భారత యువ క్రికెటర్లకు ఆఖరి అవకాశం. ధోని సారథ్యంలో జింబాబ్వేలో పర్యటిస్తున్న భారత యువ జట్టు విజయంతో సిరీస్‌ను ముగించాలని భావిస్తోంది. నేడు జింబాబ్వేతో జరిగే ఆఖరి టి20లో విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతోంది. అటు జింబాబ్వే కూడా రెండో టి20లో చిత్తుగా ఓడినా... తొలి మ్యాచ్‌లో గెలిచిన స్ఫూర్తితో మరోసారి పోరాడేందుకు సిద్ధమయింది. అంతా ఫామ్‌లో...: భారత జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ప్రత్యర్థికంటే పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌ను రాహుల్, మన్దీప్ సునాయాసంగా ముగించారు. రాయుడు, పాండే, ధోని, జాదవ్ రాణిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంది. రెండో టి20లో చెలరేగిన భారత పేసర్లు బరీందర్, బుమ్రా, ధావల్లు మరో సారి కీలకం కానున్నారు. వీరి బౌలింగ్‌ను ఎదుర్కోవడం జింబాబ్వేకు ఇబ్బందిగా మారింది. గెలిచిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ పర్యటనలో జయంత్ యాదవ్ ఒక్కడికే మ్యాచ్ దక్కలేదు. కానీ సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్‌లో ధోని ప్రయోగం చేయకపోవచ్చు. బ్యాట్స్‌మెన్ రాణిస్తేనే..: జింబాబ్వే ఆశలన్నీ వారి బ్యాట్స్‌మెన్‌పైనే ఉన్నాయి. చిబాబా, మసకద్జా, సికందర్ రజా, చిగుంబురా, వాలర్ తమ బ్యాట్లకు పని పెడితే భారత్‌కు చిక్కులు తప్పవు. అయితే నిలకడలేమితో రెండో టి20లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తగిన మూల్యం చెల్లించుకుంది. తొలి మ్యాచ్ తరహాలో పోరాడితే మాత్రం చరిత్ర సృష్టించేందుకు అవకాశం ఉంటుంది. ఫామ్‌లోలేని ఆల్‌రౌండర్ ముతుంబోజి స్థానంలో మరుమా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. -
మరో సిరీస్‌పై ధోని సేన దృష్టి!
హరారే:జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత యువ జట్టు.. టీ 20 సిరీస్ ను కూడా తన ఖాతాలో వేసుకోవడంపై దృష్టి పెట్టింది. మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో బుధవారం సాయంత్రం గం.4.30 ని.లకు చివరి మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలవడంతో ఆఖరి టీ 20పై ఆసక్తి నెలకొంది. మరోవైపు తన పర్యటనను విజయంతో ముగించాలని ధోని సేన పట్టుదలగా ఉంది. జింబాబ్వే పర్యటన ద్వారా పలువురు భారత ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. వీరిలో కేఎల్ రాహుల్, మన్ దీప్ సింగ్, బరిందర్ శరణ్, చాహల్‌లు తమ సత్తా చాటగా, ఫజల్, ఉనాద్కట్‌లు విఫలమయ్యారు. దాదాపు భారత యువ జట్టు మెరుగ్గా ఉండటంతో రేపటి విజయం ఖాయంగానే కనబడుతోంది. తొలి టీ 20లో రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైన ధోని సేన.. రెండో టీ 20లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో తన బలాన్ని చాటుకుంది. దీంతో చివరి టీ 20 కూడా ఏకపక్షంగానే ముగించాలని భారత జట్టు యోచిస్తోంది. మరోవైపు తొలి టీ 20లో అనూహ్య విజయాన్ని సాధించిన జింబాబ్వే.. మరో మ్యాచ్‌లో గెలిచి ధోని సేనకు షాకివ్వాలని భావిస్తోంది. దీంతో ఇరు జట్లు తమ తమ వ్యూహ రచనల్లో మునిగిపోయాయి. ఇదిలా ఉండగా, రేపటి మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. తొలుత టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. జట్లు అంచనా భారత జట్టు: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), కేఎల్ రాహుల్, మన్ దీప్ సింగ్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదర్ జాదవ్, అక్షర్ పటేల్, ధవల్ కులకర్ణి, బూమ్రా, బరిందర్ శరణ్, చాహల్ జింబాబ్వే జట్టు: క్రీమర్(కెప్టెన్), చిబాబా, మసకద్జా, మూర్, సికిందర్ రాజా, ముతోంబోడ్జి, వాలర్, చిగుంబరా, మద్జ్వివా, తిరిపానో, ముజారాబాని -
తొలి పోరుకు ధోని సేన సిద్ధం!
పుణె: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ ను క్లీన్స్వీన్ చేసిన టీమిండియా.. శ్రీలంకతో మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ కు సన్నద్ధమైంది. ఆస్ట్రేలియాను వారి గడ్డపై మట్టికరింపించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఆడిన టీమిండియా ..ఇప్పుడు స్వదేశంలో సరికొత్త సవాల్ తో బరిలోకి దిగుతుంది. అది ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును మరికొంత కాలం పదిలంగా ఉంచుకోవడమే. ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం టీమిండియా ఎనిమిది స్థానాలను మెరుగుపరుచుకుని 120 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టీ 20 వరల్డ్ కప్ టోర్నీకి అగ్ర జట్టుగా సిద్ధం కావాలని ధోని సేన భావిస్తోంది. దాంతో పాటు ఈ మ్యాచ్ లు కూడా వరల్డ్ కప్‌కు సన్నాహకంగా కొనసాగుతుండటంతో టీమిండియా ప్రధానంగా ర్యాంకును కాపాడుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ తరుణంలో శ్రీలంకతో సిరీస్ ను కైవసం చేసుకోవడం ఒక్కటే టీమిండియా లక్ష్యం. ఈ సిరీస్ లో ధోని సేన గెలిస్తేనే తన ర్యాంకును కాపాడుకుంటుంది. కానిపక్షంలో ఏడో ర్యాంకు పడిపోతుంది. అదే సమయంలో శ్రీలంక నంబర్ వన్ ర్యాంకుకు చేరుకుంటుంది. ప్రస్తుతం టీమిండియా సమతుల్యంగా ఉండటంతో పాటు, స్వదేశంలో మ్యాచ్ లు జరగడం జట్టుకు కలిసొచ్చే అంశం. మరోవైపు శ్రీలంక కొత్త కుర్రాళ్లతో పోరుకు సిద్దమవుతోంది. అటు మలింగా, మాథ్యూస్ లాంటి అనుభవం ఉన్న ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. అయినప్పటికీ శ్రీలంకను తక్కువగా అంచనా వేయలేం. సంచలనాలకు మారుపేరు అయిన లంకేయులతో జాగ్రత్తగా ఉంటేనే ధోని సేన ర్యాంకును కాపాడుకునే అవకాశం ఉంది. ఏమాత్రం అలసత్వం వ్యవహరించినా అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య ఆరు టీ 20 మ్యాచ్ లు మాత్రమే జరగ్గా, తలో మూడు మ్యాచ్ లను గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. అందులో 2014లో జరిగిన టీ 20 మ్యాచ్ ఒకటి. ఈ మ్యాచ్ లో శ్రీలంక చేతిలో టీమిండియా ఓటమి పాలై విమర్శల పాలైంది. ఆ తర్వాత శ్రీలంకతో తలపడుతున్న టీ 20 సిరీస్ ఇది. శ్రీలంక-టీమిండియాల మధ్య మంగళవారం రాత్రి గం.7.30 ని.లకు పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో ధోని సేన అదరగొట్టి శుభారంభం చేస్తుందా?లేదా అనేది చూడాల్సిందే. వాతావరణం వర్షం పడే అవకాశాలు లేవు. వాతావరణంతో పొడిగా ఉండటంతో మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా ఉండనుంది. -
శ్రీలంకతో సిరీస్‌ను ధోని సేన గెలిస్తేనే..
న్యూఢిల్లీ:ఇటీవల ట్వంటీ 20 ఫార్మాట్లో నంబర్ వన్ ర్యాంకును సాధించిన టీమిండియా ఆ ర్యాంకును మరికొంతకాలం పదిలంగా ఉంచుకోవాలంటే త్వరలో శ్రీలంకతో జరిగే సిరీస్ ను కూడా చేజిక్కించుకోవాల్సిందే. మరో రెండు రోజుల్లో శ్రీలంకతో మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ జరుగనున్న నేపథ్యంలో టీమిండియా తన ర్యాంకును పదిలంగా ఉంచుకోవాలంటే సిరీస్ ను గెలవాలి. మూడు మ్యాచ్ లను గెలవాల్సిన అవసరం లేకపోయినా, కనీసం రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలి. కానిపక్షంలో టీమిండియా ఏడో ర్యాంకుకు పడిపోవడం ఖాయం. ఒకవేళ అదే సమయంలో శ్రీలంక సిరీస్ ను 2-0 తేడాతో గెలిచినా, లేక క్లీన్ స్వీప్ చేసినా టాప్ స్థానానికి చేరుకుంటుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి టీమిండియా నంబర్ వన్ ర్యాంకును సాధించింది. ఆ సిరీస్ కు ముందు ఎనిమిదో స్థానంలో ఉన్న టీమిండియా ఆ తరువాత ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సిరీస్ ద్వారా విరాట్ కోహ్లి వ్యక్తిగత టీ 20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ లో కోహ్లి మూడు హాఫ్ సెంచరీలతో రాణించాడు. మంగళవారం పుణేలో ఆరంభంకానున్న టీ 20 సిరీస్ లో టీమిండియా 120 రేటింగ్ పాయింట్లతో బరిలోకి దిగుతుండగా, మూడో స్థానంలో ఉన్న శ్రీలంక 117 రేటింగ్ పాయింట్లతో పోరుకు సన్నద్ధమవుతుంది. -
టీమిండియా ఎట్ టాప్
సిడ్నీ:అంతర్జాతీయ ట్వంటీ 20 ర్యాంకింగ్స్ లో టీమిండియా టాప్ కు చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ 20 గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ధోని సేన ఎనిమిదో స్థానం నుంచి ఒక్కసారిగా పైకి ఎగబాకి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టీమిండియా 120 పాయింట్లతో ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా, ఆస్ట్రేలియా 110 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఇదిలా ఉండగా విండీస్ రెండో స్థానంలో, శ్రీలంక మూడో స్థానంలో, ఇంగ్లండ్ నాల్గో స్థానంలో కొనసాగుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ లు వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా తరువాతి స్థానాల్లో ఆప్ఘానిస్తాన్, స్కాట్లాండ్లు ఉన్నాయి. ఆదివారం జరిగిన చివరి టీ 20 మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్ విసిరిన 198 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించిన టీమిండియా సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ పై వన్డేల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. -
ఆస్ట్రేలియాలో తొలిసారి హిందీలో కామెంటరీ
మెల్బోర్న్: భారత-ఆసీస్ జట్ల మధ్య జరుగనున్న మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ ను హిందీ భాషలో ప్రసారం చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నడుంబిగించింది. సీఏ లైవ్ యాప్, క్రికెట్.కామ్ ద్వారా సిరీస్ ను హిందీ భాషలో ప్రసారం చేయనున్నారు. ఇందుకు భారత్ కు చెందిన సదరు మీడియా గ్రూప్ తో సీఏ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై సీఏ మీడియా ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ బెన్ అమర్ ఫియో మాట్లాడుతూ... ఇక్కడ ఉండే భారతీయ అభిమానుల్ని ఆస్ట్రేలియా క్రికెట్ కు మరింత దగ్గర చేయడంలో భాగంగానే హిందీలో ప్రసారానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. ఇది ఆస్ట్రేలియా క్రికెట్ టెలివిజన్ ప్రసారాల 80 ఏళ్ల చరిత్రలోనే తొలిసారి అని బెన్ స్పష్టం చేశారు. జనవరి 26(మంగళవారం) తొలి ట్వంటీ 20 అడిలైడ్ లో జరిగే మ్యాచ్ నుంచే ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. -
మరో సవాల్ కు ధోని సేన సిద్ధం
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేలో సిరీస్‌లో చివరి వన్డేలో గెలిచి ఊరట పొందిన మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా మరో సవాల్ కు సన్నద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య దైపాక్షిక సిరీస్ లో భాగంగా మంగళవారం నుంచి ట్వంటీ 20 సిరీస్ ఆరంభం కానుంది. రేపు మధ్యాహ్నం గం.2.08 ని.లకు(భారత కాలమాన ప్రకారం) అడిలైడ్ వేదికగా తొలి డే అండ్ నైట్ ట్వంటీ 20 జరుగనుంది. వన్డే సిరీస్ లో భారీ స్కోర్లు సాధించినా సిరీస్ ను కోల్పోయిన ధోని సేన.. . ట్వంటీ 20 సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. త్వరలో భారత్ లో ట్వంటీ 20 వరల్డ్ కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఈ సిరీస్ ద్వారా తనదైన ముద్ర వేయడానికి టీమిండియా తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఒకపక్క వన్డే సిరీస్ లో ఘోర పరాభవం.. మరోపక్క ఒక్కసారిగా ధోని కెప్టెన్సీపై వెల్లువెత్తిన విమర్శలకు తగిన సమాధానం చెప్పాలంటే ట్వంటీ 20 సిరీస్ ను సాధించడమే టీమిండియా జట్టు ముందున్న లక్ష్యం. ట్వంటీ 20 క్రికెట్ లో టీమిండియా సమతుల్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఆసీస్ కూడా అంతే బలంగా ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య మరోసారి రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. యువరాజ్ కు పరీక్ష దాదాపు 20 నెలల తరువాత జాతీయ జట్టులోకి వచ్చిన స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ అసలు సిసలైన పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. యువరాజ్ పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంటేనే టీమిండియా జట్టులో మనుగడ సాధ్యం. ఒకవేళ కాని పక్షంలో రాబోవు ట్వంటీ 20 వరల్డ్ కప్ కు అతని స్థానంపై గ్యారంటీ లేదు. ప్రస్తుతం టీమిండియా జట్టులో మనీష్ పాండే, రిషి ధావన్ వంటి యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో యువీకి ఈ సిరీస్ కచ్చితంగా ఒక సవాలే. గత కొంతకాలంగా దేశవాళీ మ్యాచ్ ల్లో నిలకడగా రాణిస్తున్న యువరాజ్ కు వన్డేల్లో చోటివ్వకుండా.. ట్వంటీ 20లకు మాత్రమే పరిమితం చేశారు. యువరాజ్ ను పూర్తిగా పక్కకు పెట్టాడానికే అతనికి చివరి అవకాశంగా ట్వంటీ 20ల్లో అవకాశం కల్పించినట్లు వార్తలు వినిపించాయి. వీటన్నంటికీ సమాధానం చెప్పడంతో పాటు, ఇది అతని కెరీర్ కు ఆరంభమా?, ముగింపా? అనేది తేల్చుకోవాలంటే అది యువీ చేతుల్లోనే ఉంది. టీమిండియా జట్టులో రెండు మార్పులు కేవలం వన్డేలు మాత్రమే ఎంపికైన రిషి ధావన్, గుర్ కీరత్ లకు అనూహ్యంగా ట్వంటీ 20 సిరీస్ జట్టులో స్థానం దక్కింది. గాయపడ్డ అజింక్యా రహానే స్థానంలో అతని ప్రత్యామ్నాయంగా గుర్ కీరత్ సింగ్ జట్టులోకి రాగా, బౌలర్ భువనేశ్వర్ గాయం కారణంగా రిషి ధావన్ ను జట్టులో అవకాశం కల్పించనున్నారు. వాతావరణం ఆకాశం ఎక్కువ శాతం మేఘావృతమై ఉన్నా వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అడిలైడ్ లో కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కానుంది. -
టీమిండియా ఓటమి నిరాశ పరిచింది..కానీ
కోల్ కతా:దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ 20 సిరీస్ ను టీమిండియా కోల్పోవడం నిరాశ పరిచినా.. ఇది రాబోవు ట్వంటీ 20 వరల్డ్ కప్ కు ఒక గుణపాఠంగా ఉపయోగపడుతుందని జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి తెలిపాడు. వరుసగా రెండు మ్యాచ్ ల్లో టీమిండియా ఓటమి చెంది సిరీస్ ను దక్షిణాఫ్రికాకు అప్పగించగా.. మూడో ట్వంటీ 20 వర్షం వల్ల రద్దయ్యింది. దీనిపై చివరి మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రవిశాస్త్రి.. ట్వంటీ 20 సిరీస్ లో జట్టు పోరాటపటిమ నిరాశ పరిచినా.. వన్డే సిరీస్ లో దక్షిణాఫ్రికాకు గట్టిపోటీ ఇస్తామన్నాడు. ఈ సిరీస్ లో గెలవడానికి అహర్నిశలు కృషి చేసినా ఓటమి పాలు కావడం కాస్త బాధ కల్గించదన్నాడు. తొలి మ్యాచ్ లో పోరాట పటిమ కనబరిచినా, రెండో మ్యాచ్ లో జట్టులో సమిష్టితత్వం లోపించదన్నాడు. ఈ తాజా ఓటమిపై ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం అయితే లేదని రవిశాస్త్రి స్పష్టం చేశాడు. -
మూడో ట్వంటీ 20 రద్దు
కోల్ కతా: దక్షిణాఫ్రికా -టీమిండియాల మూడో ట్వంటీ 20 మ్యాచ్ రద్దయ్యింది. మూడు ట్వంటీ 20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సిన చివరి మ్యాచ్ ను వరుణుడు అడ్డుకున్నాడు. ఈరోజు సాయంత్రం కురిసిన వర్షానికి అవుట్ ఫీల్డ్ తడిగా మారడంతో మ్యాచ్ ను రద్దు చేయకతప్పలేదు. మ్యాచ్ ను జరపడానికి పలుమార్లు పిచ్ ను పరిశీలించిన అంపైర్లు చివరకు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఇప్పటికే వరుసగా రెండు ఓటములతో సిరీస్ ను కోల్పోయిన టీమిండియా.. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి కనీసం పరువు దక్కించుకోవాలని భావించినా అది సాధ్యపడలేదు. మ్యాచ్ రద్దయిన అనంతరం ప్రకటించిన అవార్డుల్లో దక్షిణాఫ్రికా ఆటగాడు జేపీ డుమిని మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ను దక్కించుకున్నాడు. -
చివరి టీ20కు వర్షం అంతరాయం
కోల్ కతా: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య జరుగనున్న మూడో ట్వంటీ 20 మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. మూడు ట్వంటీ20 సిరీస్ లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య చివరి ట్వంటీ 20 మ్యాచ్ జరుగనుంది. కాగా ఈరోజు సాయంత్రం సమయంలో వర్షం పడటంతో పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ రాత్రి 7.00 గం.లకు ఆరంభం కావాల్సి ఉంది. అయితే రాత్రి 7.30 ని.లకు పిచ్ ను అంపైర్లు పరీక్షించిన అనంతరం మ్యాచ్ పై నిర్ణయాన్ని వెలువరిస్తారు. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ ల ను కోల్పోయి సిరీస్ ను చేజార్చుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని పట్టుదలగా ఉండగా, దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో కూడా గెలిచి ట్వంటీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. -
టీమిండియాకు షాక్
ధర్మశాల: మూడు ట్వంటీ 20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడ శుక్రవారం జరిగిన తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో టీమిండియాకు షాక్ తగిలింది. టీమిండియా విసిరిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా( 36), ఏబీ డివిలియర్స్ (51)లు శుభారంభాన్ని అందించారు. ఆమ్లా తనదైన శైలిలో ఆడితే డివిలియర్స్ వచ్చీ రావడంతోనే రెచ్చిపోయాడు. కాగా, వీరు స్వల్ప పరుగుల వ్యవధిలో అవుటైన వెంటనే డు ప్లెసిస్ (4) కూడా పెవిలియన్ కు చేరడంతో దక్షిణాఫ్రికా కాస్త ఆందోళనలో పడింది. అనంతరం జేపీ డుమినీ, బెహర్దియన్ లు దూకుడుగా ఆడారు. డుమినీ(68), బెహర్దియన్(32) పరుగులతో క్రీజ్ లో నాటౌట్ గా ఉండి దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు. వీరిద్దరూ నాల్గో వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో దక్షిణాఫ్రికా ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది. ఈ తాజా విజయంతో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యాన్ని సంపాందించింది. 15 ఓవర్ వరకూ విజయం టీమిండియా చేతుల్లో ఉన్నట్లు కనిపించినా.. ఆ తదుపరి ఓవర్ టీమిండియా విజయాన్ని పూర్తిగా దూరం చేసింది. 16 ఓవర్ వేసిన అక్షర్ పటేల్ 22 పరుగులను దక్షిణాఫ్రికాకు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్ లో డుమినీ వరుసగా మూడు సిక్సర్లు వేసి దక్షిణాఫ్రికా విజయం సాధించడానికి మార్గం సుగుమం చేశాడు. వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన డుమినికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టీమిండియా బౌలర్లలో ఎవరూ ఆకట్టుకోలేదు. అశ్విన్, ఎస్ అరవింద్ లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ చేపట్టింది. భారత్ స్కోరు 22 పరుగుల వద్ద ఉండగా ఓపెనర్ శిఖర్ ధవన్(3) అనవసర పరుగుకోసం యత్నించి రనౌట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం రోహిత్ శర్మ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ(106; 66బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీని పూర్తి చేశాడు. దీంతో అంతర్జాతీయ ట్వంటీ20 ల్లో తొలి సెంచరీని రోహిత్ నమోదు చేశాడు. రోహిత్ కు జతగా విరాట్ కోహ్లి (43) రాణించడంతో రెండో వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. కాగా, విరాట్, రోహిత్ వికెట్లను వరుసగా కోల్పోవడంతో టీమిండియా వేగం తగ్గింది. విరాట్ రెండో వికెట్ రూపంలో వెనుదిరిగగా, రోహిత్ మూడు వికెట్ గా పెవిలియన్ కు చేరాడు.అటు తరువాత స్కోరును పెంచే యత్నంలో సురేష్ రైనా(14) అవుటయ్యాడు. కాగా, అజింక్యా రహానే స్థానంలో తుది జట్టులో కలిసిన అంబటి రాయుడు డకౌట్ గా వెనుదిరగగా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(20) నాటౌట్ మిగలడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. -
నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా
ధర్మశాల: టీమిండియాతో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో 200 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 134 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. జేపీ డుమిని(15), బెహర్దియన్(25)క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు హషీమ్ ఆమ్లా(36), ఏబీ డివిలియర్స్(51), డు ప్లెసిస్ (4)లు పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో ఎస్ అరవింద్, అశ్విన్ లకు తలో వికెట్ లభించింది. టాస్ ఓడిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. -
దూకుడుగా ఆడుతున్న దక్షిణాఫ్రికా
ధర్మశాల:తొలి ట్వంటీ 20మ్యాచ్ లో భాగంగా టీమిండియా విసిరిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. దక్షిణాఫ్రికా ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. హషీమ్ ఆమ్లా(31), ఏబీ డివిలియర్స్(35) క్రీజ్ లో ఉన్నారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. భారత్ స్కోరు 22 పరుగుల వద్ద ఉండగా ఓపెనర్ శిఖర్ ధవన్(3) అనవసర పరుగుకోసం యత్నించి రనౌట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం రోహిత్ శర్మ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ(106; 66బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీని పూర్తి చేశాడు. దీంతో అంతర్జాతీయ ట్వంటీ20 ల్లో తొలి సెంచరీని రోహిత్ నమోదు చేశాడు. రోహిత్ కు జతగా విరాట్ కోహ్లి (43) రాణించడంతో రెండో వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. -
దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం