ఆసీస్ టీ 20 కెప్టెన్గా ఫించ్
సిడ్నీ:త్వరలో శ్రీలంకతో జరిగే ట్వంటీ 20 సిరీస్కు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్గా అరోన్ ఫించ్ను ఎంపిక చేశారు.ఈ సిరీస్కు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు అందుబాటులో ఉండకపోవడంతో ఫించ్ను సారథిగా నియమిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల్లో భారత్ తో టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో ఆసీస్ ప్రధాన ఆటగాళ్లు స్వదేశంలో జరిగే ట్వంటీ 20 సిరీస్కు అందుబాటులో ఉండటం లేదు.
ప్రధానంగా కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లతో పాటు మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ హజల్వుడ్, ఉస్మాన్ ఖజాలు భారత్ తో సిరీస్లో పాల్గొనున్నారు. అదే సమయంలో స్వదేశంలో ఆసీస్కు ట్వంటీ 20 సిరీస్ ఉండటంతో ఆటగాళ్లను ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే శ్రీలంకతో సిరీస్కు ఫించ్ను కెప్టెన్గా ఎంపిక చేశారు.