బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
ధర్మశాల: మూడు ట్వంటీ 20 మ్యాచ్ లో సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి ట్వంటీ 20లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జాతిపిత మహాత్మా గాంధీ 146వ జయంతి సందర్భంగా భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్ కోసం బీసీసీఐ ప్రత్యేకంగా టాస్ కాయిన్ను రూపొందించింది. 20 గ్రాముల బరువు గల స్వచ్ఛమైన వెండితో బంగారు పూత పూసి తయారు చేయించిన నాణెముతో టాస్ వేశారు.
సమవుజ్జీలైన ఇరు జట్లు గెలుపుతో సిరీస్ ను శుభారంభం చేయాలని భావిస్తున్నాయి. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా, డు ప్లెసిస్ సారథ్యంలోని దక్షిణాఫ్రికాలు గెలుపుపై పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. ధర్మశాల వేదికగా జరిగే డే అండ్ నైట్ ట్వంటీ 20 మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనబడుతోంది.
భారత తుది జట్టు:శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోని*, అంబటి రాయుడు, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, ఎస్ అరవింద్
దక్షిణాఫ్రికా తుది జట్టు: ఏబీ డివిలియర్స్, హషీమ్ ఆమ్లా, డు ప్లెసిస్*, జేపీ డుమినీ, డేవిడ్ మిల్లర్, బెహ్రార్దియన్, క్రిస్ మోరిస్, రబాదా, అబాట్, లాంజ్, ఇమ్రాన్ తహీర్