పాక్దే టీ 20 సిరీస్
దుబాయ్: వెస్టిండీస్తో జరుగుతున్న టీ 20 సిరీస్ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్లో పాక్ 16 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-0 తో చేజిక్కించుకుంది. అంతకుముందు తొలి టీ 20లో పాక్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
రెండో టీ 20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత పాక్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. పాక్ ఆటగాళ్లలో ఓపెనర్ ఖలీద్ లతీఫ్(40), కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(46 నాటౌట్), షోయబ్ మాలిక్(37)లు రాణించి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు.
అనంతర బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్ 20.0 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితమైంది. వెస్టిండీస్ ఆటగాళ్లలో సునీల్ నరైన్(30), ఆండ్రూ ఫ్లెచర్(29) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో ఓటమి పాలైంది.