ధర్మశాల: టీమిండియాతో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో 200 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతోంది. 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 134 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. జేపీ డుమిని(15), బెహర్దియన్(25)క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు హషీమ్ ఆమ్లా(36), ఏబీ డివిలియర్స్(51), డు ప్లెసిస్ (4)లు పెవిలియన్ కు చేరారు. టీమిండియా బౌలర్లలో ఎస్ అరవింద్, అశ్విన్ లకు తలో వికెట్ లభించింది. టాస్ ఓడిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.