ధర్మశాల:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో టీమిండియా ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 22 పరుగుల వద్ద శిఖర్ ధవన్ వికెట్(3) ను కోల్పోయింది.
అనవసర పరుగు కోసం యత్నించిన ధవన్ ను లాంజ్ చేతి నుంచి బంతిని వేగంగా అందుకున్నవికెట్ కీపర్ డివిలియర్స్ రనౌట్ చేశాడు. ఓపెనర్ రోహిత్ శర్మ(24), విరాట్ కోహ్లీ (4)లు క్రీజ్ లో ఉన్నారు.