
ఆ ముగ్గురికీ చోటు దక్కలేదు..
ధర్మశాల:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో భాగంగా టీమిండియా తుది జట్టులో అజింక్యా రహానే, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రాలకు చోటు దక్కలేదు. వీరి స్థానాల్లో అంబటి రాయుడు, అక్షర్ పటేల్, ఎస్ అరవింద్ లకు చోటు కల్పించారు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. సమవుజ్జీలైన ఇరు జట్లు తొలి మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను ఘనంగా ఆరంభించాలని భావిస్తున్నాయి.
భారత తుది జట్టు:శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోని, అంబటి రాయుడు, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, ఎస్ అరవింద్
దక్షిణాఫ్రికా తుది జట్టు:ఏబీ డివిలియర్స్, హషీమ్ ఆమ్లా, డు ప్లెసిస్, జేపీ డుమినీ, డేవిడ్ మిల్లర్, బెహ్రార్దియన్, క్రిస్ మోరిస్, రబాదా, అబాట్, లాంజ్, ఇమ్రాన్ తహీర్