అప్‌డేట్స్‌: ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌ | India win the toss and choose to bowl first | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 4 2018 6:41 PM | Last Updated on Sun, Nov 4 2018 10:23 PM

India win the toss and choose to bowl first - Sakshi

సాక్షి, కోల్‌కతా: టెస్టు సిరీస్‌ను ఏకపక్షంగా గెల్చుకుని, వన్డే సిరీస్‌ను ఒడిసిపట్టిన టీమిండియా.. టీ20 సిరీస్‌లోనూ వెస్టిండీస్‌తో అమీ-తుమీకి భారత్‌ సిద్ధమైంది. ఈ మేరకు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారమిక్కడి ఈడెన్‌ గార్డెన్స్‌లో రెండు జట్ల మధ్య తొలి టీ-20 మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. తమ ఆటతీరుకు సరితూగే పొట్టి ఫార్మాట్‌లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన విండీస్‌ జట్టుకు ఈ సిరీస్‌ అత్యంత కఠినమైనదే. పైగా ఈసారి దాదాపు చాలామంది కొత్తవారితో ఆడుతోంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ జట్టు భారత్‌కు 110 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్‌ అప్‌డేట్స్‌ ఇవి..

  • 24 బంతుల్లో 19 పరుగులు మనీశ్‌ పాండే, పియరీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 16 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ ఐదు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది.
     
  • 13 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 4వికెట్లు కోల్పోయి 73పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో దినేశ్‌ కార్తీక్‌(22), మనీశ్‌ పాండే(12) లు ఉన్నారు. భారత్‌ విజయానికి 42 బంతుల్లో 37 పరుగులు చేయాల్సి ఉంది.
     
  • భారత్‌ విజయం సాధించాలంటే 72 బంతుల్లో 65 పరుగులు చేయాల్సి ఉంది.
     
  • మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డ భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. నిలకడగా ఆడుతున్న కేఎల్‌ రాహుల్‌(16) కూడా బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌లో జౌటయ్యాడు. 8 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది.
     
  • రోహిత్‌, ధావన్‌ల వికెట్లు కోల్పోయిన భారత్‌కు మరో షాక్‌ తగిలింది. బ్రాత్‌ వైట్‌ బౌలింగ్‌లో పంత్‌(1) ఔటయ్యాడు. 
     
  • లక్ష్య చేధనలో భారత్‌ తడబాటుకు గురవుతోంది. తొలి ఓవర్‌లోనే రోహిత్‌ వికెట్‌ కోల్పోయిన భారత్‌, మూడో ఓవర్‌లో మరో వికెట్‌ కోల్పోయింది. థామస్‌ బౌలింగ్‌లో 3 పరుగులు చేసిన ధావన్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 2 వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది.
     
  • 110 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ తొలి ఓవర్‌లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ కోల్పోయింది. 6 బంతుల్లో 6 పరుగులు చేసిన రోహిత్‌, ఒషేన్‌ థామస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
     
  • విండీస్‌ భారత్‌కు 110 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
     
  • భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు తీయగా, ఉమేశ్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌, బుమ్రా, కృనాల్‌ పాండ్యాలకు ఒక్కో వికెట్‌ దక్కింది.
     
  • చివరి రెండు ఓవర్లలో విండీస్‌ ఆటగాళ్లు ధాటిగా ఆడటంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. చివరి రెండు ఓవర్లలో విండీస్‌ 22 పరుగులు చేసింది.
  • ధాటిగా ఆడుతున్న విండీస్‌ ఆటగాడు ఫాబియన్‌ అలెన్‌(20 బంతుల్లో 27 పరుగులు) ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి విండీస్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది.

  • ఇప్పటికే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ విండీస్‌ మరో వికెటు కోల్పోయింది. 11 బంతుల్లో 4 పరుగులు చేసిన బ్రాత్‌వైటు కుల్దీప్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మొత్తంగా 4 ఓవర్లలో 13 పరుగులిచ్చిన కుల్దీప్‌ 3 వికెట్లు తీశాడు. 15 ఓవర్లు ముగిసేసరికి విండీస్‌ 7వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. 

  • డారెన్‌ బ్రావోను పెవిలియన్‌కు పంపిన కుల్దీప్‌ యాదవ్‌కు.. మరో వికెట్‌ లభించింది. కుల్దీప్‌ వేసిన 13 ఓవర్లో 3 బంతికి రావ్‌మన్‌ పావెల్‌(4) ఔటయ్యాడు. దీంతో విండీస్‌ 13 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది.

  • భారత బౌలర్ల ధాటికి విండీస్‌ వెంటవెంటనే వికెట్లు కొల్పోతుంది. 10 ఓవర్‌లో కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో కీరన్‌ పోలార్డ్‌(14) పరుగులకు ఔటవ్వగా, ఆ తర్వాతి ఓవర్లో 10 బంతుల్లో 5 పరుగులు చేసిన డారెన్‌ బ్రావో కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం విండీస్‌ 10.2 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది.

  • ఆదిలోనే తడబాటుకు గురయిన విండీస్‌కు మరో షాక్‌ తగిలింది. 7 బంతుల్లో 10 పరుగులు చేసిన హెట్‌మైర్‌ బుమ్రా బౌలింగ్‌లో జౌటవ్వడంతో.. విండీస్‌ కష్టాల్లో పడింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి విండీస్‌ మూడు వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. ప్రస్తుతం కీరన్‌ పోలార్డ్‌(4),  డారెన్‌ బ్రావో(0) క్రీజులో ఉన్నారు.

  • టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ జట్టు ఆదిలోనే తడబడింది. ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ డీ రామ్‌దిన్‌ 2 పరుగులకు ఔటవ్వగా.. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన మరో ఓపెనర్‌ ఎస్‌డీ హోప్‌ అనూహ్యంగా రనౌట్‌ అయ్యాడు. దీంతో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన విండీస్‌ ఆదిలోనే తడబాటుకు గురైంది. ఎస్‌డీ హోప్‌ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. మొత్తానికి 4.1 ఓవర్లలో వెస్టిండీస్‌ జట్టు 2 వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది.

  • గాయం కారణంగా హార్ధిక్‌ పాండ్యా మ్యాచ్‌కు దూరం కావడంతో అతని సోదరుడు కృనాల్‌కు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌ ద్వారా  కృనాల్‌  ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు.
     
  • భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, కేఎల్‌ రాహుల్, రిషభ్‌ పంత్, దినేశ్‌ కార్తీక్, మనీశ్‌ పాండే, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్, బుమ్రా, ఖలీల్‌ అహ్మద్, ఉమేశ్‌ యాదవ్‌
     
  • వెస్టీండిస్‌: రావ్‌మన్‌ పావెల్, డారెన్‌ బ్రావో, హోప్‌, హెట్‌మైర్, రామ్‌దిన్, కీరన్‌ పోలార్డ్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), కీమో పాల్‌, కారీ పియరీ, ఫాబియన్‌ అలెన్, ఒషేన్‌ థామస్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement