టీ20 ప్రపంచకప్-2022కు ముందు టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ట్రినిడాడ్ అండ్ టొబాగో వెబ్‌సైట్ న్యూస్‌డే నివేదిక ప్రకారం... విండీస్ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ ద్వైపాక్షిక సిరీస్ జూలై 22 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో మూడు వన్డేలు,బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే బీసీసీఐ ఈ పర్యటనను ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఇక ఐపీఎల్-2022 ముగిసిన తర్వాత జూన్ 9 నుంచి19 వరకు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం ఐర్లాండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించిన వెస్టిండీస్‌ను వన్డే, టీ20 సిరీస్‌లలో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.
చదవండి: PAK vs AUS: పాకిస్తాన్ ముందు భారీ టార్గెట్.. ఓటమి తప్పదా!
Comments
Please login to add a commentAdd a comment