Breadcrumb
Live Updates
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్
సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. మూడో టీ20లోనూ టీమిండియాదే విజయం
185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయడంతో 17 పరుగుల తేడాతో ఓటమిపాలై 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-3 తేడాతో చేజార్చుకుంది. ఈ విజయంతో హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా వరుసగా మరో సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. అంతకుముందు టీమిండియా 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా క్లీన్ స్వీప్ చేసింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ (47 బంతుల్లో 61; 8 ఫోర్లు, సిక్సర్) వరుసగా మూడో మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీ చేసినప్పటికీ విండీస్‌కు విజయాన్ని అందించలేకపోయాడు.
ఆఖర్లో రొమారియో షెపర్డ్ (21 బంతుల్లో 29; ఫోర్, 3 సిక్సర్లు) భారీ సిక్సర్లతో భయపెట్టినప్పటికీ విండీస్‌కు బోణీ విజయం దక్కలేదు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, శార్ధూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 65; ఫోర్, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఓటమి దిశగా విండీస్.. ఆరో వికెట్ డౌన్
185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 12 ఓవర్లలో 100 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమిని దాదాపుగా ఖరారు చేసుకుంది. వచ్చీ రాగానే బౌండరీలతో విరుచుకుపడిన రోస్టన్ ఛేజ్ (7 బంతుల్లో 2 ఫోర్లతో 12)ను హర్షల్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా విండీస్ ఆరో వికెట్ కోల్పోయింది. క్రీజ్‌లో పూరన్ (28 బంతుల్లో 37), రొమారియో షెపర్డ్ ఉన్నారు.
బంతితోనూ మ్యాజిక్ చేస్తున్న వెంకటేశ్ అయ్యర్
19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచిన వెంకటేశ్ అయ్యర్.. బంతితోనూ మ్యాజిక్ చేస్తున్నాడు. తొలుత డేంజర్ మ్యాన్ పోలార్డ్‌ను ఔట్ చేసిన అతను.. మరో కీలక ఆటగాడు జేసన్ హోల్డర్ (2) వికెట్ కూడా పడగొట్టాడు. దీంతో 87 పరుగులకే విండీస్ సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్‌లో పూరన్ (26 బంతుల్లో 36), రోస్టన్ ఛేజ్ ఉన్నారు.
డేంజర్ మ్యాన్ పోలార్డ్ ఔట్
డేంజర్ మ్యాన్, విండీస్ కెప్టెన్ పోలార్డ్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్ బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌కి క్యాచ్ ఇచ్చి పోలార్ఢ్ పెవిలియిన్ బాట పట్టాడు. ఫలితంగా విండీస్ 82 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 9 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 83/4గా ఉంది. క్రీజ్‌లో పూరన్ (22 బంతుల్లో 34), జేసన్ హోల్డర్ ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన విండీస్
బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన రోవమన్ పావెల్ (14 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) హర్షల్ పటేల్ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. 7 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 73/3గా ఉంది. క్రీజ్‌లో పూరన్ (19 బంతుల్లో 31), పోలార్డ్ ఉన్నారు.
షాయ్ హోప్ (8) ఔట్
చాహర్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాది జోరుమీదున్నట్లు కనిపించిన షాయ్ హోప్ (4 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు) అదే ఓవర్లో వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 2.5 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 26/2గా ఉంది. క్రీజ్‌లో పూరన్ (11), రోవమన్ పావెల్ ఉన్నారు.
ఆదిలోనే విండీస్‌కు షాక్
185 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విండీస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 6 పరుగుల వద్దే మేయర్స్ (6)ను దీపక్ చాహర్ పెవిలియన్‌కు పంపాడు. వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి మేయర్స్ ఔటయ్యాడు. తొలి ఓవర్ తర్వాత విండీస్ స్కోర్ వికెట్ నష్టానికి 7 పరుగులుగా ఉంది. క్రీజ్‌లో పూరన్, షాయ్ హోప్ ఉన్నారు.
సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్
మిడిలార్డర్ బ్యాటర్లు వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 65; ఫోర్, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్య, అయ్యర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ విండీస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఐదో వికెట్‌కు 91 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సూర్యకుమార్ ఔటయ్యాడు. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో రోవమన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ ఔటయ్యాడు. విండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్, హేడెన్ వాల్ష్, డోమినిక్ డ్రేక్స్, రొమారియో షెపర్డ్ లకు తలో వికెట్ దక్కింది.
రోహిత్ శర్మ(7) క్లీన్ బౌల్డ్
93 పరుగుల వద్ద టీమిండియా కీలకమైన రోహిత్ శర్మ (15 బంతుల్లో 7) వికెట్ కోల్పోయింది. డోమినిక్ డ్రేక్స్ బౌలింగ్‌లో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 14 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 93/4 గా ఉంది. క్రీజ్‌లో సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 21), వెంకటేశ్ అయ్యర్ ఉన్నారు.
వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన టీమిండియా
63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 3 పరుగుల వ్యవధిలోనే మరో వికెట్ చేజార్చుకుంది. రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 34; 5 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 68/3 గా ఉంది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (2), సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హేడెన్ వాల్ష్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (15 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఔటయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన అయ్యర్ హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 9 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 64/2 గా ఉంది. క్రీజ్‌లో ఇషాన్ కిషన్ (28 బంతుల్లో 33; 5 ఫోర్లు), రోహిత్ శర్మ ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో మేయర్స్‌కు క్యాచ్ ఇచ్చి రుతురాజ్ గైక్వాడ్ (8 బంతుల్లో 4; ఫోర్) ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 15/1 గా ఉంది.
టాస్ గెలిచిన వెస్టిండీస్
టీమిండియాతో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో ముందుగా టీమిండియా బ్యాటింగ్ చేపట్టనుంది. ఇప్పటికే 2–0తో సిరీస్ గెలుచుకున్న టీమిండియా నేడు విండీస్‌తో చివరిదైన మూడో టి20లో తలపడనుంది. భారత్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సిరీస్‌ను గెలుపుతో ముగిస్తుందా లేక ఈ పర్యటనలో కనీసం ఒక్క విజయంతోనైనా విండీస్ వెనుదిరుగుతుందా చూడాలి.
Related News By Category
Related News By Tags
-
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో హిట్.. టెస్ట్‌ల్లో ఫట్..!
2025.. భారత పురుషుల క్రికెట్‌కు మిశ్రమ ఫలితాలు మిగిల్చిన సంవత్సరం. ఈ ఏడాది టీమిండియాకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు అనుభవాలు ఎదురయ్యాయి. టెస్ట్ క్రికెట్లో చతికిలబడిన భారత్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ...
-
శ్రీలంకతో తొలి టీ20.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
వన్డే ప్రపంచకప్ గెలిచాక ఆడుతున్న తొలి మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (డిసెంబర్ 21) జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగిపోయారు...
-
శ్రీలంకతో తొలి టీ20.. తొలుత బౌలింగ్ చేయనున్న టీమిండియా
వన్డే ప్రపంచకప్ గెలిచాక భారత మహిళల క్రికెట్ జట్టు తొలి సిరీస్ ఆడుతుంది. ఇవాల్టి నుంచి (డిసెంబర్ 21) స్వదేశంలో శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. విశాఖ వేదికగా మరికాసేపట్లో ప్రారం...
-
పాక్ బౌలర్‌కు ఇచ్చిపడేసిన వైభవ్ సూర్యవంశీ
భారత్, పాకిస్తాన్ మధ్య ఇవాళ (డిసెంబర్ 21) జరిగిన అండర్-19 పురుషుల ఆసియా కప్ ఫైనల్లో ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా భారత బ్యాటర్లను పాక్ బౌలర్ అలీ ...
-
టీమిండియాకు ఘోర పరాభవం
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఇవాళ (డిసెంబర్ 21) జరిగిన ఫైనల్లో పాక్ భారత్‌ను 191 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొల...


