ఆసియా కప్‌లో టీమిండియాకు మరో ఏకపక్ష విజయం. పాకిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్ తరహాలోనే ఎక్కడా ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా సాగిన సూపర్–4 పోరులో బంగ్లాదేశ్‌ను భారత్ చిత్తు చేసింది. ముందుగా బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి ఆపై ఆడుతూ పాడుతూ సునాయాసంగా లక్ష్యం చేరింది. పునరాగమనంలో జడేజా స్పిన్ మాయాజాలానికి భువీ, బుమ్రా అండగా నిలవగా... బ్యాటింగ్‌లో తనకు అలవాటైన రీతిలో రోహిత్ శర్మ అర్ధసెంచరీతో మ్యాచ్‌ను ముగించాడు. ఇక ఆదివారం మళ్లీ పాత ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పోరుకు భారత్ ‘సై’ అంటోంది.