వారెవ్వా.. వాట్ ఏ క్యాచ్ | ashwin takes memorable catch | Sakshi
Sakshi News home page

వారెవ్వా.. వాట్ ఏ క్యాచ్

Published Sun, Mar 5 2017 3:08 PM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

వారెవ్వా.. వాట్ ఏ క్యాచ్

వారెవ్వా.. వాట్ ఏ క్యాచ్

బెంగళూరు:భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ అద్భుతమైన క్యాచ్ తో అదుర్స్ అనిపించాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భాగంగా ఆదివారం ఆటలో అశ్విన్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన 77 ఓవర్ నాల్గో బంతికి ఆసీస్ ఆటగాడు హ్యాండ్ స్కాంబ్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడబోయాడు. కానీ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్  తన పైనుంచి వెళుతున్న బంతిని డైవ్ కొట్టి క్యాచ్ గా అందుకున్నాడు. అయితే ఆ బంతిని పట్టుకున్న తరువాత చేతుల్లోంచి జారిపోయింది.

 

ఆ సమయంలో అత్యంత సమయ స్ఫూర్తితో వ్యవహరించిన అశ్విన్ ఆ బంతిని నేలపాలు కాకుండా చేశాడు. తొలుత తన చేతుల్లోంచి జారిన బంతి భుజాలను తాకుతూ రావడంతో అశ్విన్ చాకచక్యంగా వ్యవహరించి మళ్లీ తిరిగి క్యాచ్ గా అందుకున్నాడు. చివరకు తనపడ్డ కష్టం వృథా కాకపోవడంతో అశ్విన్ 'కమాన్' అంటూ బంతిని నేలకేసి కొట్టాడు. కాగా, ఈ క్యాచ్ ను అశ్విన్ అందుకునే క్రమంలో రెప్పపాటు కాలం ఊపిరిబిగపట్టి చూసిన భారత అభిమానులు చివరకు హమ్మయ్యా అంటూ సేదతీరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement