నాలుగు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాలు 1–1తో సమంగా నిలిచినప్పటికీ ప్రస్తుతం ఆతిథ్య...
రాంచీ: నాలుగు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాలు 1–1తో సమంగా నిలిచినప్పటికీ ప్రస్తుతం ఆతిథ్య జట్టుపైనే ఒత్తిడి ఉందని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ అన్నాడు. చూపుడు వేలికి అయిన గాయం మానుతోందని మూడో టెస్టు ఆడే తుది జట్టులో తాను ఉంటానన్నాడు.
ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో మానసికంగా తమదే పైచేయిగా నిలి చిందని... ఇదే ఉత్సాహంతో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు... బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంటామని చెప్పాడు. ‘ఉపఖండం పిచ్‌లపై అశ్విన్ ఎంత నేర్పుగా బౌలింగ్ చేస్తాడో గమనించాను. అందరికీ ఒకేలా బంతిని సంధించడు. క్రీజులో ఉన్న లెఫ్ట్, రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌కు తగినట్లుగానే అతని బంతి గమనం ఉంటుంది’ అని లయన్ వ్యాఖ్యానించాడు.