Spinner Nathan Lyon
-
పాక్‌పై లయన్ పంజా
అబుదాబి: రెండో టెస్టులో ఒక దశలో పాకిస్తాన్ స్కోరు 57/1. మరికొద్ది సేపటికే ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ (4/78) దెబ్బకు 57/5. అతను రెండు ఓవర్లలోనే ఆటను మార్చేశాడు. దీంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 282 పరుగులు చేసి ఆలౌటైంది. ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన లయన్ తొలి నాలుగు బంతులకు 4 పరుగులు సమర్పించుకున్నాడు. అప్పుడు జట్టు స్కోరు 57/1. తర్వాత రెండు బంతులకు అజహర్ అలీ (15), హరిస్ సొహైల్ (0)ను ఔట్ చేశాడు. తన తదుపరి ఓవర్ (22వ) రెండో బంతికి షఫీక్, నాలుగో బంతికి బాబర్ అజమ్లను డకౌట్ చేశాడు. ఇలా ఆరు బంతుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు తీయడంతో 57/5 స్కోరు వద్ద పాక్ కుదేలైంది. అయితే తొలి టెస్టు ఆడుతున్న ఫఖర్ జమాన్ (94; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ సర్ఫరాజ్ (94; 7 ఫోర్లు)ల పోరాటంతో కోలుకుంది. ఇద్దరు 6 పరుగుల దూరంలో సెంచరీలను చేజార్చుకున్నా... ఆరో వికెట్‌కు 147 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. లబ్‌షేన్ 3, స్టార్క్ 2 వికెట్లు తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ గత మ్యాచ్ హీరో ఉస్మాన్ ఖాజా (3) సహా 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. -
‘ఒత్తిడి భారత్‌పైనే’
రాంచీ: నాలుగు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాలు 1–1తో సమంగా నిలిచినప్పటికీ ప్రస్తుతం ఆతిథ్య జట్టుపైనే ఒత్తిడి ఉందని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ అన్నాడు. చూపుడు వేలికి అయిన గాయం మానుతోందని మూడో టెస్టు ఆడే తుది జట్టులో తాను ఉంటానన్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో మానసికంగా తమదే పైచేయిగా నిలి చిందని... ఇదే ఉత్సాహంతో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు... బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంటామని చెప్పాడు. ‘ఉపఖండం పిచ్‌లపై అశ్విన్ ఎంత నేర్పుగా బౌలింగ్ చేస్తాడో గమనించాను. అందరికీ ఒకేలా బంతిని సంధించడు. క్రీజులో ఉన్న లెఫ్ట్, రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌కు తగినట్లుగానే అతని బంతి గమనం ఉంటుంది’ అని లయన్ వ్యాఖ్యానించాడు. -
అంపైర్లను తప్పు పట్టవద్దు
ధోనితో విభేదించిన లయోన్ మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో అంపైర్లు బాగానే పని చేస్తున్నారని, అనవసరంగా వారిపై విమర్శలు చేయవద్దని ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయోన్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో భారత కెప్టెన్ ధోని చేసిన వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నానని అతను చెప్పాడు. ‘అంపైర్లు చాలా కఠినమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొన్ని నిర్ణయాలు అటు భారత్‌కు, ఇటు ఆసీస్‌కు కూడా వ్యతిరేకంగా వచ్చాయి. అలా అని అంపైర్లను తప్పు పట్టవద్దు. వారు సమర్థంగా పని చేస్తున్నారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇరు జట్లు కూడా ఇలాంటి అంశాల విషయంలో తమ భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి’ అని లయోన్ సూచించాడు. డీఆర్ఎస్ అమల్లో ఉన్నా దానికి కూడా రెండు వైపులా పదును ఉందని, ఏ జట్టుకైనా అది అనుకూలంగా మారే అవకాశం ఉండేదని గుర్తు చేశాడు.