వెనక్కి తగ్గను: వార్నర్
బెంగళూరు: భారత స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో షాట్లు ఆడటం అంత సులభం కాకపోయినా... బ్యాటింగ్‌లో తాను వెనక్కి తగ్గనని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో అశ్విన్ చేతిలో మూడుసార్లు వార్నర్ పెవిలియన్ చేరాడు. మరొకవైపు 13 టెస్టుల్లో తొమ్మిదిసార్లు అశ్విన్ బౌలింగ్ లో వార్నర్ అవుటయ్యాడు. దాంతో తన టెస్టు కెరీర్ లో ఒకే ఆటగాడ్ని అత్యధిక సార్లు అవుట్ చేసిన ఘనతను అశ్విన్ సాధించగా, అదే సమయంలో ఒకే బౌలర్ కు తన వికెట్ ను అత్యధిక సార్లు సమర్పించుకున్న అప్రథను వార్నర్ సొంతం చేసుకోవడం ఇక్కడ గమనార్హం.
దీనిపై మాట్లాడుతూ ‘అశ్విన్ ప్రమాదకర బౌలర్. ఎవర్నినైనా ఔట్ చేయగలడు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆడాలన్నాడు. ఇదిలా ఉంచితే పుజారా, కోహ్లిల స్లెడ్జింగ్‌పై స్పందించనని చెప్పాడు. బ్యాట్ల సైజును కుదించాలన్న మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిర్ణయంపై స్పందిస్తూ... ‘దాంతో పెద్ద ప్రభావమేమీ ఉండదు. ఎలాంటి మార్పు లొచ్చినా వాటిని మనం స్వాగతించాల్సిందే’ అని అన్నాడు.